– కేంద్రం, రాష్ట్రంలో ‘మార్పుల’పై వెనకడుగు
– మంత్రుల పనితీరుపై అధినాయకత్వాల అసంతృప్తి
– ‘తేనెతుట్టె’ కదపద్దని సీఎం రేవంత్ రెడ్డి యోచన?
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్)
మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణ, విస్తరణ విషయంలో అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకడుగు వేస్తున్నట్లు కనిపి స్తున్నది. తమ పాలన విషయంలో విశేష మార్పులు తీసుకురావాలని ఈ రెండు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. అందుకు ప్రస్తుత క్యాబినెట్లోని కొందరు మంత్రుల పనితీరుపై ఈ రెండు ప్రభుత్వాలుకూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. అం చుకు క్యాబినెట్లో మార్పులు, చేర్పులు అనివార్యంగా భావిస్తున్నాయి. అయితే ప్ర స్తుతం నెలకొన్న రాజకీయ పరిస్తితుల దృ ష్ట్యా ఎవరిని కదిలిస్తే ఏమవుతుందోనని వెనక్కు తగ్గినట్లు కనిపిస్తున్నది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పన్నెం డు ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాలనలో విశేష మార్పులు జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. దానికి తగినట్లుగా ఇటీవల కాలంలో జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల తోపాటు, ఇకముందు జరుగనున్న కీలక రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలోకూడా మార్పులు, చేర్పులు అనివార్యంగా బిజేపీ అధినాయకత్వం భావిస్తున్నది. ప్రధానంగా మోదీ- 4 లక్ష్యంగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టనుంది. అప్రతిహతంగా నరేంద్రమోదీ మూడవసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. ప్రధానిగా నెహ్రూ, ఇందిరాగాంధీ రికార్డులను అధిగమించిన మోదీ నాల్గవసారి కూడ ప్రధానిగా కొనసాగేవిధంగా పార్టీ పావులు కదుపుతోంది. అందుకే ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా పాలనలో మార్పులు తీసుకురావటంలో భాగంగా మంత్రుల పనితీరుపై దృష్టిసారించింది. ఈ క్రమంలో కొందరికి మంత్రివర్గం నుండి ఉద్వాసన తప్పదనుకుంటున్నారు. కాగా, కొందరి శాఖల మార్పు అనివార్యంగా భావిస్తున్నట్లు తెలుస్తున్నది. వివిధ రాష్ట్రాల్లో తమ విజయానికి సహకరిస్తూ వస్తున్న మిత్రపక్షాలకు చోటు కల్పించే అవకాశాలు లేకపోలేదు. అలాగే ఇక ముందు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రా లనుకూడా దృష్టిలో పెట్టుకుని అక్కడి తమ పార్టీ నేతలకు మంత్రి లేదా పార్టీ పదవో ఇవ్వడంద్వారా బీజేపీ ఆయా రాష్ట్రాల్లో దూసుకుపోయే విధంగా కార్యాచరణను సిద్ధంచేసుకుంటోంది. తెలంగాణ నుంచి ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు. వారిలో కిషన్రెడ్డి క్యాబినెట్ మంత్రికాగా, బండి సంజయ్కుమార్ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. కిషన్రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇందులో కిషన్రెడ్డి శాఖను మర్చే అవకాశముందనుకుంటున్నారు. గతంలో తెలంగాణరాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన బండి సంజయ పట్ల కేంద్ర నాయకత్వానికి ప్రత్యేక అభిమానముంది. ఇదిలాఉంటే రాబోయే తెలంగాణ రాష్ట్రఅసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పార్టీని మరింత విస్తృతం చేయడంలో భాగంగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణలో రాష్ట్రంనుంచి మరొకరికి క్యాబినెట్ లో అవకాశమివ్వనున్నట్లు వినికిడి. ఇందుకు ప్రధానంగా ఈటల రాజేందర్, డికె అరుణ, ధర్మపురి అరవింద్ తోపాటు నగేశ్ పేర్లు వినిపి స్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గిరిజన ఓట్లపై దృష్టి పెట్టడంతో నగేశ్ కి ఆ అవకాశం దక్కుతుందనుకుంటున్నారు. అయితే ఈ మార్పు చేర్పులను వర్షాకాల సమావేశాల ముందా తర్వాత అన్న మీమాంసలో కేంద్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో మంత్రివర్గం విషయంలో తొందరపడవద్దనుకుంటున్నట్లు తెలుస్తున్నది. దానికి తగినట్లు జూలై 20 నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు షెడ్యూల్ ప్రకటించడంతో ఈ మార్పు చేర్పులు ఆగస్టు, సెప్టెంబర్లో జరుగవచ్చనుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సాగతీత
రాష్ట్రం విషయానికొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ముప్పై నెలలు కావస్తున్నా ఇంకా ఇద్దరు మంత్రులను తీసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సాగతీతగా వ్యవహరిస్తున్నది. పార్టీలోని సీనియర్ నాయకులు చాలామంది ఈసారైనా తమకు మంత్రి పదవి లభిస్తుందేమోనన్న ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇతర పార్టీనుంచి వచ్చిన వారుకూడా ఆశగా ఉన్నారు. మునుగోడు ఎంఎల్డీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రాహింపట్నం ఎంఎల్ఎ ఎం. రంగారెడ్డి పేర్లు మాత్రం ముందు వరుసలో ఉన్నప్పటికీ, ఆశావహుల సంఖ్య మాత్రం పెద్దగానే ఉంది. దీంతో ఎవరికి మంత్రి పదవినిచ్చినా మిగతావారు అలిగే అవకాశంలేకపోలేదు. ఇప్పటికే పార్టీలో అంతర్గత విబేదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో కొత్త మంత్రులను తీసుకోవడమంటే తేనతెట్టును కదిలించినట్లు అవుతుందని, అందుకు మరికొంతకాలం వాయిదా వేసు కోవడమే శ్రేయస్కరంగా రేవంత్రెడ్డి సర్కార్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తున్నది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





