– గురు పూర్ణిమ సందర్భంగా బీజేపీ చీఫ్ రామచందర్‌రావు పూజలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశం మరింత పురోగతి పథంలో ముందుకు సాగాలని సాయిబాబా ఆశీస్సులు కోరుకున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. గురుపూర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో ఆయన బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లోని సాయిబాబా ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, దేశ శ్రేయస్సు కోసం సాయిబాబా ఆశీస్సులు కోరుతూ ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. గురుపూర్ణిమ పర్వదినం సందర్భంగా సాయిబాబా ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని, తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా, సశ్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించానని చెప్పారు. ముఖ్యంగా మన రైతులు పంటలతో సంతోషంగా ఉండాలి.. మహిళలు భద్రంగా, గౌరవంగా జీవించాలి.. యువతకు మంచి అవకాశాలు, ఉజ్వల భవిష్యత్తు కలగాలి.. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని సాయిబాబాను వేడుకున్నానన్నారు.
గురు వందన కార్యక్రమంలో..
గురుపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ తెలంగాణ దేవాదాయ ప్రకోష్ట్ ఆధ్వర్యంలో బేగంపేటలోని పుష్పగిరి మహా సంస్థానంలో నిర్వహించిన గురు వందన కార్యక్రమంలో రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజ్య జగద్గురు అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామీజీకి పూర్ణకుంభ స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు పొందారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





