జీఆర్‌ఎం‌బీ అజెండాపై తెలంగాణ అభ్యంతరం

– అజెండాలో గత అంశాలను తొలగించాలని డిమాండ్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ‌గోదావరి రివర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌బోర్డు(జీఆర్‌ఎం‌బీ) అజెండాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నెల 18న జీఆర్‌ఎం‌బీ 18వ సమావేశం జరగనుంది. తెలంగాణ ప్రాజెక్టులపై మూడు అంశాలు అజెండాలో పెట్టడంపై అభ్యంతరం తెలిపింది. సమ్మక్క బ్యారేజీకి అనుమతులు నిలిపివేయాలనే అంశాన్ని తొలగించాలని కోరింది. తెలంగాణ ప్రాజెక్టుల టిఎసి అనుమతుల వివరాల అంశం కూడా వద్దని తెలిపింది. సిడబ్ల్యూసి తదితర సంస్థలు ఇచ్చిన అనుమతుల సక్ష అంశంపైనా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశాలపై ఇప్పటికే జీఆర్‌ఎం‌బీలో విస్తృతంగా చర్చించామని వెల్లడించింది. గతంలో ఏపీ అభ్యంతరాలను సిడబ్ల్యూసి పరిశీలించి తిరస్కరించిందని తెలంగాణ సర్కార్‌ ‌వాదించింది. సిడబ్ల్యూసి అవార్డు, మార్గదర్శకాల ప్రకారమే ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. మూడు అంశాలను అజెండా నుంచి డ్రాప్‌ ‌చేయాలని జీఆర్‌ఎం‌బీకి తెలంగాణ సర్కార్‌ ‌లేఖ రాసింది. సవరించిన అజెండా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇదిలావుంటే ఈ ఎజెండాపై వారం క్రితమే మాజీమంత్రి హరీష్‌ ‌రావు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అజెండా అంశాలను ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *