జనవరి 26 నుంచి  ప్రతిష్టాత్మక పథకాల అమలు 

 

సొంత భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12 వేల ఆర్థిక చేయుత
నేరుగా కుటుంబ మహిళా ఖాతాలో జమ 
ప్రభుత్వం మహిళా పక్షపాతి
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పై మంత్రి సీతక్క సమీక్ష

గణతంత్ర దినోత్సవం నుంచి  ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతోంది..సొంత భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12 వేల ఆర్థిక చేయుత అందించబోతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. శనివారం ఎర్రమంజిల్ మిషన్ భగీరథ కార్యాలయంలో డిఆర్డిఓ లతో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు పై జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశంలో ఈ రాష్ట్రంలో ఇటువంటి పథకం లేదు  కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తున్నాం..కుటుంబంలో ఉండే ఉపాధి హామీ మహిళా కూలీ బ్యాంకు ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని జమ చేస్తామన్నారు.  ప్రభుత్వం మహిళా పక్షపాతి అని పేర్కొంటూ    .. అందుకే మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నాం..ఇలాంటి పథకాన్ని తీసుకురావడం పేద కుటుంబం నుంచి వొచ్చిన తనకు  ఎంతో సంతోషం కలిగించిందన్నారు . తను  ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ చేతుల మీదుగా కూలీలకు ఆర్థిక చేత అందించడం సంతోషంగా ఉందన్నారు . చిన్న పొరపాటు జరిగినా  పేదలకు  నష్టం వాటిల్లుతోంది..అందుకే జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు . చారిత్రాత్మక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను విజయవంతం చేయాలని సూచిస్తూ గ్రామ సభ వేదికగానే అర్హుల గుర్తింపు, లబ్ధిదారుల ఎంపిక జరగాలి..శాంతియుత వాతావరణంలో గ్రామ సభలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు . గ్రామసభ నిర్ణయమే ఫైనల్ కాబట్టి గ్రామసభ నిర్ణయాన్ని శిరసావహించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలన్నారు.మానవీయ దృక్పథంతో, సామాజిక స్పృహతో అధికారులు వ్యవహరించాలి..సాంకేతిక కారణాలతో పేదలకు నష్టం వాటిల్ల లేకుండా చూడాలి..పేదలకు లబ్ధి చేకూర్చేలా, ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా అధికారులు పనిచేయాలి అని హితవు పలికారు . .రైతులకు కూలీలకు పంచాయతీ పెట్టేలా టిఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆ పార్టీ ని విమర్శిస్తూ   ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై అనవసర రాజకీయాలు తగదు..కూలీలకు రూపాయి సహాయం చేయని టిఆర్ఎస్ పెద్దలు సైతం విమర్శలు చేయడం హాస్యాస్పదం..అర ఎకరం ఉన్న రైతు కన్నా.. ఏ భూమి లేని కూలికే అధిక లబ్ధి చేకూరుతుందని కూలీలను అవమానపరిచేలా టిఆర్ఎస్ మాట్లాడుతోంది..రైతులకు రుణమాఫీ చేయని టిఆర్ఎస్ ఇప్పుడు రైతులపై మోసలి కన్నీరు కారుస్తోందన్నారు. రైతులకు రైతు భరోసా, పంట బోనస్ ద్వారా కౌలు రైతులకు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా కూలీలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాం..అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియ, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మంత్రి భరోసానిచ్చారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సామరస్య పూర్వక వాతావరణం లో గ్రామసభలు జరిపించాలని మంత్రి సూచిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమల్లో తలెత్తే లోటుపాట్లను సవరిస్తాం..అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరా ఆత్మీయ భరోసా అందిస్తాం..కూలీ భరోసా ను విఫలం చేసే కుట్రకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి..గ్రామ సభల్లో కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయని పేర్కొంటూ  కూలీలు, అధికారులను  అప్రమత్తం చేసారు. ఈ సమావేశం లో పంచాయతి రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖా కార్యదర్శి  లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన, అన్ని జిల్లాల డి ఆర్ డి వో లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page