ఇండిగో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం

– అత్యవసరంగా గోవాలోనే ల్యాండింగ్

న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : గోవా నుంచి దిల్లీ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. మంగళవారం ఉదయం 9.15 గంటలకు గోవా ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ సాంకేతిక లోపం ఏర్పడింది. దీన్ని గుర్తించిన విమానం పైలట్ వెంటనే మనోహర్ ఎయిర్‌పోర్టు అధికారులకు తెలియజేశారు. వారి అనుమతితో ఈ విమానాన్ని అత్యవసరంగా గోవా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. దీంతో విమానంలోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ నేపథ్యంతో గోవా ఎయిర్‌పోర్టులో అధికారులు ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ విమానంలోని ప్రయాణికులను దిల్లీ తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నట్లు, అందుకోసం మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇండిగో యాజమాన్యం వెల్లడించింది. విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు కనుగొన్నారని వివరించింది. విమానంలో సమస్యను గుర్తించే పనిలో సాంకేతిక సిబ్బంది ఉన్నారని పేర్కొంది. ప్రయాణికులతోపాటు విమాన సిబ్బందికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ఇండిగో తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *