‘‌శుద్ధీకరణ’ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి

– వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల
– బిజెపి తీరుపై మండిపడ్డ రాహుల్‌ ‌గాంధీ

న్యూదిల్లీ, ఆగస్ట్ 29: ఉత్తరాఖండ్‌ ’‌శుద్ధీకరణ’ ఘటనను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ తప్పుబట్టారు. భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అస్పృశ్య‌త‌ను చట్టబద్ధంగా నిషేధించారని, కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళితుడనే కారణంతో ఇలా మైదానాన్ని శుద్ధి చేయడం ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం తీవ్రమైన నేరమని రాహుల్‌ ‌పేర్కొన్నారు. దిల్లీలోని ఇందిరా భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో రాహుల్‌ ‌గాంధీ మాట్లాడుతూ ’శుద్ధీకరణ’ సమాజంలో ఇంకా బతికే ఉన్న అంటరానితనానికి మరో పేరని వ్యాఖ్యానించారు. శుద్ధీకరణ పూజను నిర్వహించిన వారిపై, దీనికి మద్దతు ఇచ్చిన ఉత్తరాఖండ్‌ ‌స్థానిక బీజేపీ నేతలపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసి అరెస్ట్ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశారు. దళితులు సమాజంలో ఎదగడం, గౌరవంగా బతకడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఇష్టం లేదని, ఈ ఘటన వారి కులవివక్ష భావజాలాన్ని స్పష్టం చేస్తోందని మండిపడ్డారు. ఆగస్టు 8వ తేదీన హల్ద్వానీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు. ర్యాలీ ముగిసిన రెండు రోజుల తర్వాత శ్రీరామ్‌ ‌సేన అనే స్థానిక సంస్థ ఆ మైదానంలో గంగాజలం చల్లి, హవనం (పూజ) నిర్వహించి మైదానాన్ని శుద్ధి చేసింది. దీంతో వివాదం మొదలైంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *