– 118 మంది ఎమ్మెల్యే మద్దతు తప్పనిసరి
– మద్దతు ఇచ్చే పార్టీల లేఖలు అవసరం
– పూర్తి మెజార్టీ ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం
– గవర్నర్ విశ్వనాథ్ భేటీలో స్పష్టీకరణ
చెన్నై, మే 6 : టీవీకే చీఫ్ విజయ్ కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ షాక్ ఇచ్చారు. తగినంత మెజారిటీ చూపించలేకపోవడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పా టుకు 118 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరని గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో తక్షణం ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. మద్దతు ఎమ్మెల్యేలు లేదా పార్టీల జాబితా సమర్పించాలని, అప్పుడే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలుకుతామని స్పష్టం చేసినట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్భవన్లో గవ ర్నర్ను విజయ్ కలుసు కున్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, పలు పార్టీలు కూడా తమతో చేతులు కలపనున్నాయని గవర్నర్ కు విజయ్ వివరించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకుంటానని విజయ్ వివరించినట్టు తెలుస్తోంది. అయితే విజయ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు కు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి టీవీకే వద్ద ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. విజయ్ రెండు సీట్లలో గెలవడంతో ఒక సీటును వదులుకోవడం అనివార్యం. దీంతో టీవీకే కు 107 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నట్టయింది. కాంగ్రెస్ బలం కూడా కలిపితే టీవీకే బల నిరూపణకు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరం. ఐడీఎంకే 47 సీట్లలో గెలవగా అందులోని ఒక వర్గం టీవీకే వైపు మొగ్గుచూపుతోంది. పీఎంకే-4. ఐయూఎంఎల్-2, సీపీఐ-2, సీపీఎం-2, డీఎండీకే, ఐఎంఎంకే చెరో సీటు కలిగి ఉ న్నాయి. టీవీకేకు చిన్న పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశాలు బలంగానే ఉన్నాయి. ఆ యితే అధికారికంగా మద్దతు ఇస్తేనే సంఖ్యా బలాన్ని విజయ్ చూపించుకునే అవకాశం ఉంటుంది.
కాగా, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఈనెల 7న విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మంచి ముహూర్తం కావడంతో ఉదయం 10 నుంచి 11.15 గంటల మధ్య విజయ్ ప్రమాణ స్వీకారం చేయాలని భావించారు. ఇందుకోసం చెన్నెలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నా రు. సుమారు 5,000 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేసి గురువారం ఉదయం 6 గంటల కల్లా సిద్ధం చేయనున్నట్టు టీవికే వర్గాలు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమం కావడంతో స్టేడియం వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





