సోషల్ మీడియా పోస్టులు తొలగించాలి

– బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై కోర్టు అభ్యంతరం
– తీర్పుపై మంత్రిసీతక్క హర్షం  

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్ల అంశంపై బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంలో వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియా వేదికలపై ప్రచారం సాగిందని గుర్తించిన కోర్టు, సంబంధిత పోస్టులను తక్షణమే తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి సీతక్క దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణ సందర్భంగా కోర్టు టెండర్ ప్రక్రియను మొదటి దశ నుంచి చెల్లింపుల వరకు సమగ్రంగా పరిశీలించింది. ప్రభుత్వ కొనుగోలు విధానంలో పారదర్శకత, నిబంధనల అమలు, ఆర్థిక లావాదేవీల వివరాలను సూక్ష్మంగా పరి శీలించిన అనంతరం బీఆర్ఎస్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంగా నిర్ధారిం చింది. ముఖ్యంగా రూ.30 కోట్ల అవినీతి జరి గిందన్న ఆరోపణలను కోర్టు పూర్తిగా ఖండిం చింది. అధికారిక రికార్డుల ప్రకారం ఒక్కో మొబైల్ ఫోన్ రూ.11,650 ధరకు మొత్తం 38,130 ఫోన్లను రూ.44,42,14,500వ్య యంతో కొనుగోలు చేసినట్లు స్పష్టమైంది. అయితే రూ.8,499 విలువైన ఫోన్ను రూ. 14,499కు కొనుగోలు చేశారన్న బీఆర్ఎస్
ఆరోపణలు అసత్యమని కోర్టు తేల్చిచెప్పింది. అలాగే ఈ తప్పుడు ప్రచారం మంత్రి సీతక్క వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతోనే
సాగిందని పిటిషనర్ తరఫు వాదనతో కోర్టు ఏకీభవించింది. ప్రజల్లో అపోహలు కలిగిం చేలా, ప్రభుత్వంపై అవిశ్వాసం పెంచేలా చేసిన ఈ ప్రచారం బాధ్యతారాహిత్యానికి నిదర్శ నమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తోపాటు పార్టీ అధికారిక సోషల్ మీడి యా అకౌంట్ల ద్వారా ఏప్రిల్ 10న ప్రచురించిన పోస్టులను ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికల నుంచి తక్షణమే తొలగించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మంత్రి సీతక్క తరపున అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ వినిపించిన వాదనలతో ఏకీభవించిన కోర్టు తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

బీఆర్ఎస్ కి చెంప పెట్టు : మంత్రి సీతక్క

అసత్యాలను ప్రచారం చేసి ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నాలు ఎంతకాలం నిలవవు. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందనే విషయాన్ని ఈ తీర్పు మరోసారి నిరూపించింది. అంగన్వాడీ సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా పారదర్శక విధానాలను పాటించింది. నిరాధార ఆరోపణలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధం. ఇలాంటి తప్పుడు ప్రచా రాలను చట్టపరంగా ఎదుర్కొనేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ప్రజల విశ్వాసమే మా బలం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *