– ఏబీపీ కింద రాష్ట్రంలో ప్రాజెక్టు అమలు : సీఎం రేవంత్
– కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యతో వీసీ
హైదరాబా<, ప్రజాతంత్ర, మే 27 : అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ఏబీపీ) కింద రాష్ట్రంలో టి-ఫైబర్ ప్రాజెక్టు అమలుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవడం, పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలను వేగవంతం చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి జ్యోతిరాదిత్యతో చర్చించారు. కేంద్ర మంత్రి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఏబీపీ సజావుగా అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి కొన్ని కీలక అంశాలను సింథిóయా దృష్టికి తీసుకువెళ్ళారు. మండలం నుండి గ్రామ పంచాయతీ రింగ్ నెట్‌వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఏర్పాటు చేయడం గురించి కూడా ప్రస్తావించారు. వీటిపై సింథియా సానుకూలంగా స్పందించారు. ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ బలమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే తెలంగాణ లక్ష్య సాధనకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే బలమైన నెట్‌వర్క్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం, కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకోవడంతో నిజమైన డిజిటల్ తెలంగాణకు పునాది పడనుంది. టీ-ఫైబర్ నెట్‌వర్క్ ప్రతి గ్రామ పంచాయతీని రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా అనుసంధానించనుంది. రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా ఒక మార్గంలో అంతరాయం ఏర్పడినా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సేవలు నిరంతరం కొనసాగుతాయి. తద్వారా గ్రామీణ తెలంగాణకు నిజమైన నిరంతర హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అందనుంది. మొదటి దశలో దెబ్బతిన్న నెట్‌వర్క్ ఉన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరించనున్నారు. ఏబీపీ కింద ఈ గ్రామాలను ఆధునిక, భవిష్యత్తు అవసరాలకు సరిపడే ఫైబర్ మౌలిక సదుపాయాలతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో సమానంగా అనుసంధానిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ డి.అనుదీప్, ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




