కుల వృత్తులను ప్రోత్సహించాలి

– వాటికి ప్రాధాన్యత కల్పిస్తున్న ప్రభుత్వం
– రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : బీసీ కుల వృత్తులను ప్రోత్సహించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆషాఢ బోనాల ప్రారంభం సందర్భంగా హెచఎండీఏ మైదానంలో బోనాలు-చేతివృత్తుల మేళాను ప్రభుత్వ విప్ బీర్ల్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాగూర్, ఈర్లపల్లి శంకర్, కార్పొరేషన్ల చైర్మన్లు, ఆ శాఖ సెక్రటరీ బాల మాయదేవితో కలసి ఆయన గురువారం ప్రారంభించారు. కులవృత్తులను ప్రోత్సహించడం, బీసీ వర్గాలకు చెందిన కళాకారులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈనెల 26 వరకు నిర్వహిస్తున్న ఈ మేళాలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీసీ చేతివృత్తుల కళాకారులకు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించామన్నారు. బోనాల పండుగకు అవసరమైన బోనం కుండలతోపాటు సంప్రదాయ ఆచారాలకు ఉపయోగించే వివిధ రకాల వస్తువులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానంలో అంతర్భాగమైన అనేక కులవృత్తులు కనుమరుగు కాకుండా మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కులవృత్తులు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడమే కాక పర్యావరణహితమైన, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కూడా ప్రోత్సహిస్తాయని అన్నారు. భావితరాలకు కులవృత్తుల ప్రాధాన్యతను తెలియజేస్తూ కుల వృత్తుల కళాకారుల జీవనోపాధిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలందరూ ఈ ప్రదర్శనలను సందర్శించి బీసీ కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి ఆయా స్టాళ్లను సందర్శించి వృత్తి కళాకారులతో ముచ్చటించారు. ఈ ప్రదర్శనలో టెర్రకోట ఉత్పత్తులు, మట్టి పాత్రలు, జనపనార ఉత్పత్తులు, గద్వాల్ చీరలు, పోచంపల్లి ఇక్కత్ చేనేత వస్త్రాలు, నిర్మల్ బొమ్మలు, నిర్మల్ చిత్రకళా ఉత్పత్తులు, వెండి ఫిలిగ్రీ కళాఖండాలు, వరాహి హస్తకళ ఉత్పత్తులు, వరంగల్ దుర్రీలు, నారాయణపేట చేనేత వస్త్రాలు, పెంబర్తి ఇత్తడి కళాఖండాలు, సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలోని సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, రానున్న వినాయక చవితి సందర్భంగా పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలు, పూసల కళాఖండాలు, సంప్రదాయ మందులు, విశ్వకర్మ కళాకారుల ఉత్పత్తులు, ప్రభుత్వ విజయ డెయిరీ ఉత్పత్తులు ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. కళాకారుల నైపుణ్యాన్ని మంత్రి అభినందిస్తూ తమ సంప్రదాయ కళలు, కులవృత్తులను భావితరాలకు అందించే దిశగా నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏబీసీ¾ కార్పొరేషన్ సిఈఓ అలోక్ కుమార్, బి.సి రెసిడెన్సీయల్ స్కూల్స్ సెక్రటరీ సైదులు, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు, బీసీ స్టడీ సర్కిల్ హరికృష్ణ, వివిధ బీసీ కుల కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు, కళాకారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *