– హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టుతో సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : క్రీడా రంగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉందని, రాష్ట్రానికి ఒక స్పోర్ట్స్ పాలసీని తీసకురావడమేగాక స్పోర్ట్సు యÖనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. గతంలో జాతీయస్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదికైందని గుర్తు చేస్తూ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు రివార్డుతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. టీజీ-20 లీగ్ విజేత హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది. జట్టును అభినందించి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో సీఎం మాట్లాడుతూ క్రీడలకు సంబంధించి మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు. ఏ రంగంలోనైనా ఫోకస్ లేకపోతే రాణించలేమని, ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగంపై గౌరవం ఉండాలని, ఆసక్తితో ముందుకు వెళ్లాలని ఉద్బోధించారు. గ్రామీణ క్రీడాకారులకు టీజీ-20 ఒక మంచి అవకాశం అంటూ మీరు దేశ ప్రతిష్ఠను పెంచే క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. సీఎంను కలిసిన వారిలో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ‘ఈనాడు’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్, తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





