ముస్లింలకు సీఎం బక్రీద్ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : త్యాగనిరతి, దైవభక్తికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్హా) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం చేయడానికి సిద్ధపడిన గొప్ప సంఘటనను స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని గుర్తు చేశారు. బక్రీద్ పండుగ మనిషికి త్యాగం, దాతృత్వం, విశ్వాసం, మానవత్వం వంటి గొప్ప విలువలను గుర్తు చేస్తుందన్నారు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా దేవుడిపై నమ్మకంతో సన్మార్గంలో ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ పండుగ అందిస్తోందని తెలిపారు. తమకు ఉన్నదాంట్లో కొంతైనా అవసరమైన వారికి పంచిపెట్టడం కన్నా గొప్ప దానం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ ప్రపంచానికి చాటిచెబుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *