పీఆర్సీపై సీఎం హామీ అమలు చేయాలి

– ఆరోగ్య పథకానికి అత్యుత్సాహంతో వేతనాల కోత
– 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్
– పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయాలి
– తరగతికి ఒక గది, ఒక టీచర్ ఉండాలి
– బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలి
– డీటీఎఫ్ రాష్ట్ర శాఖ డిమాండ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: అనేక వేదికల మీద ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వెంటనే పీఆర్సీ కమిషన్ నుండి రిపోర్ట్ తెప్పించుకొని అమలుకు చర్యలు చేపట్టాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమయ్య అధ్యక్షతన హైదరాబాద్ లోని డిక్కీ హౌస్ లో శుక్రవారం జరిగింది. సోమయ్య, లింగారెడ్డి లు మాట్లాడుతూ పీఆర్సీ గడువు ముగిసి మూడు సంవత్సరాలు అయిందని, ఇక ఏమా త్రం ఆలస్యం చేయకుండా వెంటనే పీఆర్సీ నివేదిక తెప్పించుకొని 1.07.2023 నుండి అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి విధివిధానాలు ఖరారు కాకముందే, పథకం అమలు చేయకుండానే, అధికారులు అత్యుత్సాహంతో ఉద్యోగుల వేతనాల నుండి కోత విధించడం సరికాదన్నారు. ఇప్పటికైనా సమగ్రమైన రీతిలో విధివిధానాలు రూపొందించి ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో ప్రకారం పాత పెన్షన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ అందుకు విరుద్ధంగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేసిన విధంగా తెలంగాణలో కూడా అమలు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల, పెన్షనర్ల ఆర్థిక బిల్లులు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఐదు డిలు విడుదల చేయాలనీ, సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి పర్యవేక్షక పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తికి సంబంధించి అశాస్త్రీయంగా ఉన్న జీవో 25 ను సవరించాలని, ప్రాథమిక స్థాయిలో తరగతికి ఒక గది, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చూడాలన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూ ల్స్ స్థానంలో, ఉన్నత పాఠశాలలన్నింటినీ సె మీ రెసిడెన్షియల్ గా మార్చి ప్రభుత్వ పాఠశా లను అభివృద్ధి చేయాలన్నారు. జనగణన మొదటి దశ పూర్తయినందున జులైలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్ర మోషన్లకు షెడ్యూల్ విడుదల చేయాలన్నారు. సమావేశంలో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం.గంగాధర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి శాంతన్, వి.రాజిరెడ్డి, టి.శ్రీశైలం, బి.రేణుక, చాప బాబు, ఎం.శామ్యూల్, జె రామస్వామి, ఎ.శ్రీనివాస్ రెడ్డి, బి.శ్యామ్, ఆర్.లింగయ్య, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్.కిష్టప్ప, అధ్యాపక జ్వాల సంపాద కురాలు జి.కళావతి, రాష్ట్ర అకడమిక్ సెల్ కన్వీనర్ డాక్టర్ బి.రామకృష్ణ, సభ్యులు సృజన, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు బి.సదానందం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి కార్యకలాపాల నివేదిక ప్రవేశపెట్టగా సభ్యులు చర్చించి ఆమోదించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *