ఓ-సిటీలో 38 రెసిడెన్షియల్ ప్లాట్ల వేలం

– గజానికి గరిష్ఠంగా రూ.75 వేల ధర నమోదు

హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 26 : వరంగల్‌లోని ఓ-సిటీ టౌన్‌షిప్‌లో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (‘కుడా’) ఆధ్వర్యంలో శుక్రవారం రెసిడెన్షియల్ ప్లాట్ల బహిరంగ వేలం జరిగింది. హనుమకొండ జిల్లా కలెక్టర్, ‘కుడా’ వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయి పాల్గొని వేలం ప్రక్రియను పర్యవేక్షించారు. మొత్తం 45 రెసిడెన్షియల్ ప్లాట్లను వేలానికి ఉంచగా వాటిలో 39 ప్లాట్లు విక్రయమయ్యాయి. వేలంలో గజానికి గరిష్ఠంగా రూ.75,000 ధర నమోదు అయింది. ప్లాట్లకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస(అప్‌సెట్) ధర గజానికి రూ.48,000గా ఉండగా అన్ని ప్లాట్లు ఆ ధర కంటే అధిక ధరకే విక్రయమయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ ‘కుడా’ అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. నాణ్యమైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లకు మంచి డిమాండ్ ఉండటం నగర అభివృద్ధికి సానుకూల సంకేతమని పేర్కొన్నారు. ‘కుడా’ సీపీవో అజిత్ రెడ్డి, ఈఈ భీంరావులు వేలం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించగా అధిక సంఖ్యలో కొనుగోలుదారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *