అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌కు మద్దతు

– ప్రభుత్వ మద్దతు లేకుంటే పనులు జరగవు
– మాజీ స్పీకర్‌ ‌పోచారం కామెంట్

‌కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌కి మద్దతు ఇచ్చానని ఎమ్మెల్యే పోయారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్నం పెట్టిన వాళ్లను మరిచిపోతే పుట్టగతులుండవన్నారు. కేసీఆర్‌ ‌చేశారు కాబట్టే.. చేశారని చెప్పానని.. రేవంత్‌ ‌రెడ్డి ఇచ్చినవి కూడా చెబుతానని తెలిపారు. ఉన్నది ఉన్నట్లు చెప్పడం తన నైజమని అన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అభివృద్ధి నిధులకు సంబంధించి తనకు న్యాయం జరగలేదంటూ వ్యాఖ్య‌లు చేశారు. దానికి కొనసాగింపుగా గురువారం కూడా వర్ని మండలం జాకోరా గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మరోసారి హాట్‌ ‌కామెంట్స్ ‌చేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. తనకు స్వార్థం ఉందంటూ బుద్ధిహీనులు ప్రచారం చేస్తున్నారని, స్వార్థం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ ‌విసిరారు. ’నా మాటల వెనుక రాజకీయం, రహస్యం లేదు.. నేను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు.. నాకు ఎలాంటి స్వార్థం లేదు.. ప్రజల కోసమే నా జీవితం’ అని స్పష్టం చేశారు. పోరాటం చేస్తా తప్ప తల వంచే రాజకీయం చేయనని స్పష్టం చేశారు. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమైనా చేస్తానన్నారు. ఎమ్మెల్యేకు ప్రభుత్వ సహకారం కావాలని, ప్రభుత్వ సహకారం లేకుంటే ఏమీ చేయలేమని పోచారం వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *