టెస్సరాక్ట్ కు భూకేటాయింపులపై రాజకీయం

– భువనగిరి ఎంపీ చామల మండిపాటు

న్యూదిల్లీ, ఆగస్ట్ 13 : టెస్సరాక్ట్ ‌సంస్థకు కేటాయించిన భూములపై బీఆర్‌ఎస్‌ ‌రాజకీయం చేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ఎం‌పీలతో కలిసి ఆయన మాట్లాడారు. ‘ఎలక్ట్రానిక్‌ ‌మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌క్లస్టర్‌లో బీఆర్‌ఎస్‌ ‌హయాంలో 54 కంపెనీలకు భూ కేటాయింపులు జరిగాయి. వారి హయాంలో ఎకరాకు రూ.30లక్షల నుంచి రూ.80లక్షల చొప్పున ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చాక 8 కంపెనీలకు భూ కేటాయింపులు జరిగాయి. ఎకరా రూ.1.50 కోట్లకు కేటాయించాం. 5 ఎకరాలు కావాలని టెస్సరాక్ట్ ‌సంస్థ 2024లో దరఖాస్తు చేసుకుంది. ఏడాదిపాటు పరిశీలించి ఆ సంస్థకు 2025లో భూమిని కేటాయించాం. అందరికీ కేటాయించినట్టుగానే ఆ సంస్థకు కూడా ఎకరా రూ.1.50 కోట్ల చొప్పున ఇచ్చాం. 2025 వరకు టెస్సరాక్ట్ ‌సంస్థకు కొండల్‌రెడ్డి డైరెక్టర్‌, ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌కాదని ఎంపీ చామల వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *