ఈసీఐ పేరుతో ఫేక్‌ ‌మెసేజ్‌లు

-అప్రమత్తంగా ఉండాలన్న సీఈవో

హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ఈసీఐ పేరుతో వోటర్లకు మోసపూరిత సందేశాలను సైబర్‌ ‌మోసగాళ్లు పంపిస్తున్నారని తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ‌(సీఈవో) సుదర్శన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. వోటర్‌ ‌వివరాలు సరిపోలడం లేదంటూ ఫేక్‌ ‌మెసేజ్‌లు వస్తున్నాయని, వీటిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దరఖాస్తు తిరస్కరణ పేరుతో రూ.5లు చెల్లించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారన్నారు. వాట్సాప్‌ ‌లింక్‌ ‌ద్వారా దరఖాస్తు నింపాలని కోరుతున్నారని. బ్యాంక్‌ ‌వివరాలు, పాస్‌వర్డ్‌లను సైబర్‌ ‌నేరగాళ్లు అడుగుతున్నారని సీఈవో తెలిపారు. ఇలాంటి మెసేజ్‌లు ఈసీఐ, తెలంగాణ ఎలక్షన్‌ ‌కార్యాలయం నుంచి రావని స్పష్టం చేశారు. ఫేక్‌ ‌కాల్స్, ‌మెసేజ్‌లకు స్పందించొద్దని, మోసపూరిత సందేశాలు వస్తే పోలీస్‌ ‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సుదర్శన్‌ ‌రెడ్డి సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *