– అసెంబ్లీ వద్ద లాఠీచార్జి
రాంచీ, ఆగస్టు 10 : ఝార్ఖండ్ పబ్లిక్ సర్విస్ కమిషన్(జేపీఎస్‌సీ) పేపర్ లీక్ ఉదంతంపై విద్యార్థుల నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విద్యార్థులు అసెంబ్లీ వరకూ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వేలాదిగా విద్యార్థులు రాజధాని రాంచీకి తరలివచ్చారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించాల్సిందేనంటూ విద్యార్థులు నినదించారు. ప్రభుత్వం శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంది. పలు కూడళ్లు, రహదారులపై బ్మారికేడ్లను ఏర్పాటు చేసి సున్నిత పరిస్థితులున్న ప్రాంతంలో పోలీసులను భారీగా మోహరించింది. సోమవారం స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పరీక్షల్లో అక్రమాలపై నిరసన తెలుపుతున్న ఉద్యోగార్థులు జార్ఖండ్ అసెంబ్లీ సమీపంలోని బ్యారికేడ్లను దాటడానికి సోమవారం ప్రయత్నించగా పోలీసులు వాటర్ కెనన్‌లు, బాష్పవాయువు ప్రయోగించి లాఠీఛార్జి చేశారు. పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారి మోర్చా నాయకుడు దేవేంద్ర నాథ్ మహ్తో 10.5 కిలోల బరువు తగ్గినప్పటికీ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి షిబు సోరెన్ చిత్రాన్ని చేతబూని కనిపించారు. కాగా, నియామక పరీక్షల్లో అక్రమాల ఆరోపణలపై జేపీఎస్‌సీ మాజీ చైర్మన్‌ను జార్ఖండ్ సీఐడీ అరెస్టు చేసింది. జూలై 28 నుండి ఆయనను నాలుగుసార్లు విచారించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




