– లఖన్‌పూర్‌లో రూ.25,016 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు
– దేశంలోనే తొలి ప్రాజెక్టుగా చరిత్ర పుటల్లోకి
– 20న శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
న్యూదిల్లీ, జూన్ 19 : భారత దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పారిశ్రామిక రంగంలో ఆత్మ నిర్భరత సాధించడంతోపాటు దిగుమతుల భారాన్ని తగ్గించే దిశగా మరో కీలక ముందడుగు పడనుంది. ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లా లఖన్‌పూర్‌లో రూ.25,016 కోట్లతో చేపట్టనున్న కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 20న శంకుస్థాపన చేయనున్నారు. కోల్ గ్యాసిఫికేషన్ దేశంలోని ఇంధన భద్రతను బలోపేతం చేయడంతోపాటు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. దేశంలోని బొగ్గుకు మరింత విలువ పెంచడంతోపాటు, అనుబంధ రంగాల అభివృద్ధికి కీలకంగా మారనుంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గును సిన్‌గ్యాస్‌గా మారుస్తారు. ఈ సిన్‌గ్యాస్‌ను ఉపయోగించి మిథనాల్, యూరియా, అమ్మోనియం నైట్రేట్, సింథటిక్ నేచురల్ గ్యాస్ (ఎసఎన్‌జీ) వంటి అనేక ఉత్పత్తులు, రసాయన పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను తయారు చేసే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా, వినియోగదారుగా భారత దేశం నిలిచింది. ఇక, కోలిండియా లిమిటెడ్ ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ. మన దేశంలో ప్రస్తుతం 400 బిలియన్ టన్నులకుపైగా బొగ్గు నిల్వలు ఉన్నాయి. నిల్వల విషయంలో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉంది. ఇంతటి అద్భుతమైన వనరులను కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియతో మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. దీంతో దేశ పారిశ్రామిక రంగంలో గణనీయమైన మార్పులు తీసుకురావడంతోపాటు, కీలక రసాయనాలు, ముడి పదార్థాల కోసం దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా వచ్చే అద్భుతమైన అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సర్ఫేస్ కోల్, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు రూ.46వేల కోట్ల మేర ఇన్సెంటివ్ పథకాలకు ఆమోదం తెలిపింది. ఈ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పరిశ్రమలు, రసాయన ఉత్పత్తుల కోసం దేశీయంగా ఉత్పత్తి అయిన బొగ్గు వినియోగాన్ని పెంచడంతోపాటు, నేచురల్ గ్యాస్, మిథనాల్, అమ్మోనియా, ఇతర క్రిటికల్ ముడి పదార్థాల కోసం దిగుమతులను తగ్గించాలనే లక్ష్యంతో కృషి చేస్తోంది. ప్రస్తుతం భారత్ ఏటా రూ.2.7 లక్షల కోట్ల విలువైన ఎండ్ యూజ్, ఇంటర్మీడియట్ రసాయన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. కోల్ గ్యాసిఫికేషన్‌తో ఈ దిగుమతులను గణనీjáƒంగా తగ్గించడంతోపాటు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తుంది. అలాగే దేశీయంగా మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. తద్వారా పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక ఆత్మ నిర్భరత సాధ్యపడుతుంది. కోల్ గ్యాసిఫికేషన్ ఇన్సెంటివ్ పథకం ద్వారా రూ.2.5 నుంచి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాక బొగ్గు ఉత్పత్తి అయ్యే ప్రాంతాల్లో 25 ప్రాజెక్టుల ద్వారా దాదాపు 50 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుంది. బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ తయారు చేసేందుకు దేశంలో స్థాపించనున్న తొలి ప్రాజెక్టుగా చరిత్ర పుటల్లో నిలవనుంది. దీన్ని భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (బీసీజీసీఎల్) అభివృద్ధి చేస్తోంది. ఇది భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచఈఎల్) , కోలిండియా లిమిటెడ్ (సీఐఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ. ఈ ప్లాంటులో బీహెచఈఎల్ స్వదేశీ పరిజ్ఞానంతో రోజుకు రెండు వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తి చేయనుంది. ఏప్రిల్ 2026లో బీసీజీసీఎల్, మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) మధ్య భూమి లీజుకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఎంసీఎల్ అధీనంలోని సుమారు 350 ఎకరాల భూమిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. అవసరమైన అనుమతులు ఇప్పటికే వచ్చాయి. శంకుస్థాపన జరిగిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి ప్రాజెక్టుల కోసం బొగ్గు గనులు ఉన్న ప్రాంతాలకు సంబంధించిన భూమిని వినియోగించుకునేందుకు కేంద్ర బొగ్గు శాఖ త్వరితగతిన అనుమతులు ఇవ్వడమే కాక ఇన్సెంటివ్ పథకం కింద రూ.1,350 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. లఖన్‌పూర్ ప్రాజెక్టు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా చేపట్టే బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు ఒక మోడల్‌గా నిలవనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





