మెకెదాటు డ్యామ్ నిర్మాణం త‌గ‌దు

– కావేరి డెల్టా రైతులకు తీరని నష్టం
– కర్నాటక తీరుకు నిరసనగా తమిళ అసెంబ్లీలో తీర్మానం

చెన్నై, జూన్ 19 : కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై మెకెదాటు వద్ద డ్యామ్ నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నాలను తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. డ్యామ్ నిర్మాణంతో కావేరి డెల్టా రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని తమిళనాడు ఆరోపిస్తోంది. గత నెలలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంగా మెకెదాటు వద్ద డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని వినతి పత్రం సమర్పించారు. కావేరి నిర్వాహక మండలిలో సభ్యులుగా ఉన్న రాష్ట్రాల ఆమోదం లేకుండా ఈ ప్రాజెక్టును చేపట్టడానికి వీలులేదని, ఈ విషయమై కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్ర నీటి వనరుల శాఖకు ఆదేశాలివ్వాలని మోదీని కోరారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసిన మెకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కర్ణాటక ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు కావేరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ తుది అవార్డుతోపాటు సుప్రీంకోర్టు తీర్పులను పూర్తిగా ఉల్లంఘిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పర్యావరణ, సాంకేతిక అనుమతులు సహా ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి అనుమతులూ ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్, వీసీకే, ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *