మన వనరులే మన పెట్టుబడి

– సంపద సృష్టి దిశగా అడుగులు
– పొరుగు రాష్ట్రాలకు ఇసుక ఎగుమతిపై అధ్యయనం
– పీపీపీ మోడల్ పర్యాటక ఆస్తుల అభివృద్ధి
– టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజంపై దూకుడు
– వీకెండ్స్ లో హెలికాప్టర్ పర్యటకానికి ప్రణాళికలు
– పర్యాటకం, రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక దృష్టి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: ప్రభుత్వానికి ఆదాయ వనరులు తీసుకువచ్చే రంగాలపై పూర్తిగా దృష్టి పెట్టాలని ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. మన వనరులే మన పెట్టుబడి అని ఆయన అన్నా రు. ఆదాయ వనరుల సమీకరణపై మంత్రివర్ణ ఉప సంఘం సచివాలయంలో శుక్రవారం సమావేశమైంది. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటక కేంద్రాల్లోని ప్రభుత్వ భూములు, స్థలాలను సమర్థవంతంగా వినియోగించి ఖజానాకు ఆదాయాన్ని తీసుకురావాలని సూచించారు. గోవా, కేరళ వంటి రాష్ట్రాలు పర్యాటకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాయని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు ఉపాధిని కల్పించడమేకాక జీడీపీ పెరుగుదలకు టూరిజం ఉపయోగపడుతోందని చెప్పారు. మన రాష్ట్రంలోనూ టూరిజాన్ని అలగే అభివృ ద్ది చేయాలని అధికారులకు సూచించారు.టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం రంగాల్లో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. వారాంతాల్లో హెలీకాప్టర్ టూరిజాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. శ్రీ శైలం, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో ప ర్యటకాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టులు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టూరిజం ఆస్తు లు పూర్తి స్థాయిలో వినియోగంలో లేవన్నా రు. వాటిని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసి సంపద సృష్టించాలని సంబంధిత అధికారు లకు ఆయన సూచనలు చేశారు. ఆదాయ సమీకరణలో పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి లక్ష్యా ల సాధనలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏకో టూరిజం, హెల్త్ టూరిజం, టెంపుల్ టూరి జంలో అవకాశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పీపీపీ ఆధారిత సమగ్ర పర్యాటక అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కేబినెట్ ముందుంచాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన విధానపరమైన అంశాలను కేబినెట్ ముందుంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మేడిగడ్డ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పూడికతీత పనులపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష చేసింది. చట్టపరమైన నిబంధనలు పాటించే క్రషర్లకు అనుమతులు ఇవ్వాలని సబ్ కమిటీ అభిప్రాయపడింది.

లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మేడిగడ్డ పై సమీక్ష

లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మేడిగడ్డ తదితర ప్రాంతాల్లో పూడికతీత పనులపై కేబినెట్ పబ్ కమిటీ సమీక్ష చేసింది. చరంగా నిబంధనలు పాటించే క్రషర్ల నిర్వాహకులకు అనుమతులు ఇవ్వాలని సబ్ కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. నది ఇసుకతో పోలిస్తే రోబో శాండ్ తక్కువ ధరకు లభిస్తోందని సబ్ కమిటీ గుర్తించింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ఇసుకను ఎగుమతి చేయడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా స్లాబ్ అధారిత భూముల విలువ సవరణ వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. రవాణా శాఖకు సంబంధించి ఆదాయం, వసూళ్లు పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ కమిటీ సకమీక్ష చేసింది. అందులో భాగంగా బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ల విషయంలో పన్నులపై రాష్ట్ర అధికారాన్ని సమర్థిస్తూ కేరళకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినట్లు సబ్ కమిటీ గుర్తించింది. భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్లపై చట్టపరమైన, విధానపరంగా తీసుకోవల్సిన అంశాలపై సబ్ కమిటీ చర్చింది. బీహెచ్ సిరీస్ పన్నుల అంశంపై చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖకు సంబంధించి పారిశ్రామిక భూముల క్రమబద్ధీ కరణ కార్యక్రమాల ద్వారా ఆదాయ సమీకరణను సమీక్షించారు.
ఈ సమావేశంలో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్-ఎండీ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రెటరీ రాజీవ్ గాంధీ హనుమంతు, ట్రాన్స్ పోర్ట్ కమిషన్ ఇళాంభర్తి, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వాణి ప్రసాద్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, స్పెషల్ సెక్రెటరీ కృష్న ఆదిత్య, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *