– రితబ్రత నియామకంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న కోర్టు
కోల్‌కతా, జూన్ 18 : తృణమÖల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ కృష్ణారావు నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణ జరిపే వరకు స్పీకర్ నిర్ణయం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణకు ముందే అఫిడవిట్ల మార్పిడిని పూర్తి చేయాలని ఇరు పక్షాలను న్యాయస్థానం ఆదేశించింది. ప్రతివాదులు మÖడు వారాల్లోగా తమ వ్యతిరేక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని, దానిపై మరో పక్షం వారు రెండు వారాల్లోగా స్పందించాలని గడువు విధించింది. తదుపరి విచారణ జూలై 28కి వాయిదా వేసింది. దీంతో ఈ కేసు ఫలితం వెలువడే వరకు రితబ్రత బెనర్జీ గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతగా కొనసాగనున్నారు. కాగా, టీఎంసీ నుంచి బహిష్కృమైన రితబ్రత బెనర్జీ ఆ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలకు న్యాయకత్వం వహిస్తున్నారు. దీంతో బెంగాల్ రాజకీయ సంక్షోభంలో వివాదం రాజుకుంది. తమకు 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేల మద్దతుందని పేర్కొంటూ ఆమె మేనల్లుడైన అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా ఓ చీలిక వర్గాన్ని రితబ్రత ఏర్పాటు చేశారు. తిరుగుబాటు వర్గం వాదనను అంగీకరిస్తూ రితబ్రతను ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ నియమించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. స్పీకర్ నిర్ణయం అధికారికంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీని పక్కనపెట్టిందని, శాసనసభ పార్టీల గుర్తింపును నియంత్రించే రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించిందని వాదిస్తూ దీదీ వర్గం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





