– పది గ్రాములపై 3వేలకు పైగా దిగివచ్చిన ధరలు
న్యూఢిల్లీ, జూన్ 19: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారడం, చమురు ధరలు పడిపోవడం వంటి పరిణామాలతో ఈ లోహాలకు డిమాండ్ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,49,270గా ఉంది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు రూ.3000కు పైనే తగ్గింది. ఇక కేజీ వెండి ధర రూ.2.37లక్షలు పలికింది. వెండి ధర ఒక్క రోజే రూ.8,600 తగ్గడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఈ లోహాల ధరలు దిగొచ్చాయి. ఔన్సు పుత్తడి ధర 4,139 డాలర్లు, ఔన్సు వెండి ధర 63.85 డాలర్లుగా ఉంది. కమొడిటీ ఎక్స్ఛేంజి మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1.46 లక్షలకు పడిపోయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ధర రూ.2.30 లక్షలుగా కొనసాగుతోంది. అమెరికా`ఇరాన్ యుద్ధం ముగియడం, ఫెడ్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు కోలుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే మన కరెన్సీ రూపాయి విలువ కూడా బలపడుతోంది. చమురు ధరలు యుద్ధం మునుపటి స్థితికి దిగొస్తున్నాయి. బంగారం, వెండి ధరలపై ఈ కారణాలు ప్రభావం చూపుతున్నాయని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగా కొనుగోళ్లు తగ్గడం కూడా వీటి ధరల పతనానికి కారణమవుతున్నట్లు పేర్కొంటున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





