యూఏఈకి ఇజ్రాయిల్‌ ఐరన్‌ ‌డోమ్‌

– ఇరాన్‌ ‌దాడుల నుంచి రక్షణకు..
– అమెరికా పత్రిక సంచలన కథనం

న్యాయార్క్,ఏ‌ప్రిల్‌ 27: ‌పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రగులుతున్న వేళ యూఏఈని ఇజ్రాయిల్‌ అనూహ్యంగా ఆదుకొంది. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో ఇరాన్‌ ‌క్షిపణులు, డ్రోన్లను యూఏఈ తన ఎయిర్‌ ‌డిఫెన్స్ ‌వ్యవస్థలతో అడ్డుకొంది. కానీ, కొన్ని ఇరాన్‌ ఆయుధాలు కీలక మౌలిక వసతులపై దాడులు చేయడంతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ‌మిత్రదేశాల సాయం కోరింది. దీంతో ఇజ్రాయెల్‌ ‌ముందుకొచ్చి దానికి సాయం చేసినట్లు అమెరికా పత్రిక సంచలన కథనం ప్రచురించింది. ఇజ్రాయెల్‌ ‌తన ఐరన్‌డోమ్‌ ‌వ్యవస్థను యూఏఈకి పంపించడంతోపాటు.. దానిని ఆపరేట్‌ ‌చేసి రాకెట్లు, డ్రోన్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ దళాలను కూడా అక్కడికి తరలించింది.  ఇరాన్‌ ‌దాడుల తీవ్రత పెరగడంతో యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్‌ ‌బిన్‌ ‌జయేద్‌ ‌నుంచి ఇజ్రాయెల్‌ ‌ప్రధాని నెతన్యాహుకు ఫోన్‌కాల్‌ ‌వెళ్లింది. ఆ తర్వాతే ఐరన్‌ ‌డోమ్‌ ‌వ్యవస్థను యూఏఈకి తరలించాలని ఇజ్రాయెల్‌ ‌ప్రధాని నుంచి ఐడీఎఫ్‌ ‌దళాలకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఇరాన్‌ ‌దాడులకు ప్రధాన టా•-గ్గ•ట్‌గా మారిన అబుదాబికి ఊరట లభించింది. దీంతో డజన్లకొద్దీ ఇరాన్‌ ‌క్షిపణులను యూఏఈ ఈ ఎయిర్‌ ‌డిఫెన్స్ ‌వ్యవస్థతో అడ్డుకొంది. ఇరాన్‌ ఈ ‌యుద్ధ సమయంలో మొత్తం ఆ దేశంపై 550 బాలిస్టిక్‌ ‌క్షిపణులు, 2,200 డ్రోన్లు ప్రయోగించినట్లు అబుదాబి రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ చర్యతో ఇజ్రాయెల్‌-‌యూఏఈ మిత్రత్వం మరింత పెరిగినట్లు అమెరికా డియా సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ ‌దేశం బయట తన సొంత ఎయిర్‌ ‌డిఫెన్స్ ‌వ్యవస్థను మోహరించింది యూఏఈలోనే. అయితే అమెరికా కూడా తన సొంత ఐరన్‌ ‌డోమ్‌ను వాడుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *