– పద్మభూషణ్ అందుకున్న నటుడు మమ్ముట్టి
– పద్మశ్రీలు అందుకున్న మురళీమోహన్, రాజేంద్రప్రసాద్
- కార్యక్రమానికి ప్రధాని మోదీ తదితరుల హాజరు
న్యూదిల్లీ, జూన్ 23: రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల దుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ విడతలో మొత్తం 2 పద్మ విభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. సినీ, సాహిత్య, వైద్య, క్రీడా తదితర రంగాల్లో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులు ఈ గౌరవాలను అందుకున్నారు. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడుకు కూడా పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేశారు. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులు మురళీమోహన్, రాజేందప్రసాద్‌తో పాటు నటుడు ఆర్. మాధవన్‌కు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. క్రికెటర్ రోహిత్ శర్మకు కూడా పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి అందజేశారు. ప్రఖ్యాత మలయాళ పాత్రికేయుడు పి.నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అందుకోగా.. సినీ రంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాగ్నిక్‌తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు రాష్టాల్ర నుంచి నేడు పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నవారిలో సినీ నటులు మాగంటి మురళీ మోహన్, రాజేందప్రసాద్ ఉన్నారు. అలాగే, వీరితో పాటు సినీనటుడు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. దేశంలోని పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రం మొత్తం 131 మందికి పద్మ పురస్కారాలకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తొలి విడతలో 66 మందికి అందజేయగా.. మిగతా వారికి మంగళవారం ప్రదానం చేశారు. దేశ అభివృద్ధికి, తమ తమ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్రసింగ్ షెకావత్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




