– కాంగ్రెస్ నేత జయరాం రమేశ్
న్యూదిల్లీ: లోక్‌సభలో మూడవ వంతు మెజారిటీ కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని, దాంతో రిజర్వేషన్లను అంతం చేయాలని ఆ పార్టీ చూస్తున్నట్లు కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ ఆరోపించారు. మూడోవంతు మెజారిటీ రాగానే రాజ్యాంగ సవరణ చేపట్టి రిజర్వే షన్ ప్రక్రియను పూర్తిగా ఎత్తివేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ తొలుత మహిళా రిజర్వే షన్ బిల్లు నెపంతో డీలిమిటేషన్ బిల్లును తెచ్చిందని, దాని ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్ను అంతం చేయడమే అవుతుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ పట్ల ప్రభుత్వం నిజంగా చిత్తశుద్దితో ఉంటే నారీ శక్తి వందన్ అభియాన్ బిల్లును ప్రస్తుత లోక్‌సభ సామర్థ్యంతో అమలు చేయాలని జయరాం డిమాండ్ చేశారు. టీఎంసీ, శివసేన యూబీటీ చీలికలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జోక్యం ఉన్నట్లు ఆరోపించారు. బీజేపీకి 400 సీట్ల రావాలన్న కాంక్ష ఉందని, దాని కోసం రాజ్యాంగాన్ని సవరణ చేసి రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 17న లోక్ సభలో డీలిమిటేషన్ బిల్లులు పాస్ కాకపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. బుల్డోజ్ చేసైనా డీలిమిటేషన్ బిల్లును ఆమోదించాలని హోం శాఖ మంత్రి ప్రయత్నించారని, కానీ విఫలమైనట్లు రమేశ్ తెలిపారు. ఆ రోజు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని షా విభిన్న రాజనీతికి పాల్పడుతున్నట్లు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




