– ఉగ్రవాదానికి ఊతమిచ్చిన ఘనత వారిది
– న్‌లాడెన్‌ను దాచిపెట్టిన చరిత్ర పాక్‌ది
– పాక్‌పై ప్రేమను వ్యక్తం చేసిన వాన్స్‌పై సెనేటర్ల విమర్శలు
వాషింగ్టన్, జూన్ 23 : పాకిస్థాన్‌పై ప్రేమను వ్యక్తం చేస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను అమెరికాకు చెందిన ఇద్దరు సెనేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ దేశ ఉగ్రచరిత్ర గురించి ప్రస్తావిస్తూ బిన్ లాడెన్‌ను దాచిన ఘనత పాక్‌దని అన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, ఖతార్ దేశాలపై అమెరికాకు చెందిన ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు రిక్ స్కాట్, టిమ్ షీహీ ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన చరిత్ర ఆ దేశాలకు ఉందంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కాగా, అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన సాంకేతిక వివరాలపై స్విట్జర్లాండ్‌లో ఇటీవల చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి పాకిస్థాన్, ఖతార్ నాయకులతో వాన్స్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేము పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కాగా, ఈ చర్చల్లో పాకిస్థాన్, ఖతార్‌లను నిష్పక్షపాత మధ్యవర్తులుగా చూడకూడదని సెనేటర్ రిక్ స్కాట్ తేల్చి చెప్పారు. మధ్యప్రాచ్యంలో యÖఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలే వాషింగ్టన్‌కు నిజమైన మిత్రదేశాలని పేర్కొన్నారు. ఆ దేశాలను అమెరికా చర్చల్లో చేర్చుకోవాలని స్కాట్ సూచించారు. ’మన నిజమైన స్నేహితులు ఎవరో ఇప్పటికే అందరికీ స్పష్టంగా తెలిసి ఉండాలి.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన సుదీర్ఘ చరిత్ర ఖతార్, పాకిస్థాన్‌లకు ఉంది.. ప్రస్తుతం వారు అర్థవంతమైన శాంతిని సాధించడం కంటే ఇరాన్ దశాబ్దాల నాటి ఉగ్రవాద ప్రచారాన్ని ప్రోత్సహించడానికే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.. అందరికీ ప్రయోజనం చేకూర్చే ఆచరణీయమైన ఒప్పందానికి ఇంకా ఆస్కారం ఉంది’ అని అన్నారు. మోంటానా సెనేటర్ టిమ్ షీహీ కూడా పాకిస్థాన్‌ను విమర్శించారు. ’పాకిస్థాన్ ఒక దశాబ్దం పాటు బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిందనే విషయాన్ని మనం మరిచిపోకూడదు.. పాకిస్థానీలు ఐఎసఐ ద్వారా మాపై పోరాడే వారికి నిధులు సమకూర్చారు.. ముఖ్యంగా అయతుల్లాకు నిధులు అందించారు.. ఖతార్ కూడా దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థలకు మనీలాండరింగ్ ద్వారా డబ్బును అందిస్తోంది.. ఇరాన్, అమెరికా` ఇజ్రాయెల్ శాంతి ఒప్పందంలో పాకిస్థాన్, ఖతార్‌లు పాల్గొంటే ఆ చర్చల్లో యÖఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలనూ చేర్చుకోవాలి.. మధ్యప్రాచ్యంలో ఆ మÖడు దేశాలే అమెరికాకు నిజమైన మిత్ర దేశాలు’ అని పేర్కొన్నారు. కాగా, వీరి వ్యాఖ్యలు ఇప్పటికే ఉన్న వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




