కిట్స్‌ వరంగల్‌లో క్రీడా సందడి!

· కేయూ అంతర్ కళాశాల పురుషుల టోర్నమెంట్

·  5 నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు

వరంగల్,ప్రజాతంత్ర, అక్టోబర్ 03: కాకతీయ యూనివర్సిటీ అంతర్ కళాశాల పురుషుల క్రీడా పోటీలు 2026–27 (ఫేజ్–1)కు కిట్స్ వరంగల్ క్యాంపస్ వేదిక కానుంది. కిట్స్ వరంగల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 5న కిట్స్ వరంగల్ క్యాంపస్‌లోని క్రీడా మైదానాల్లో పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ టి. శాస్త్రి గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఈ పోటీల్లో షటిల్ బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ తదితర క్రీడాంశాల్లో పురుషుల జట్లు పోటీపడనున్నాయి. వివిధ కళాశాలలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. కిట్స్‌ వరంగల్ ఛైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు కార్యక్రమానికి అధ్యక్షత వహించనుండగా,   కోశాధికారి శ్రీ పి. నారాయణరెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కిట్స్ వరంగల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, వివిధ విభాగాల డీన్లు, విభాగాధిపతులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, పీఆర్ఓ డాక్టర్ డి. ప్రభాకరాచారి, ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు వెంకటస్వామి, నాగరాజు, మహేష్ తదితరులు పాల్గొననున్నారు. పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, విద్యార్థులు హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *