శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు

– కనుల పండువగా గోదారంగ‌నాథుల‌ వికారి శ్వారి క్రతు జీవహోత్తవ 
మేడ్చల్, ప్రజాతంత్ర , జూన్ 18: ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం, ధార్మిక విలువలను పెంపొందిస్తాయని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా  అన్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ నాచారం సర్కిల్  మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ మంగాపురంలో గోదాదేవి రంగనాథ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వికారి శ్వారి క్రతు జీవహోత్తవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా , ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్  లు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు అతిథులకు సాదర స్వాగతం పలికి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర గవర్నర్  మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం, ధార్మిక విలువలను పెంపొందిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
——————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *