– మంత్రి అడ్లూరిపై కొప్ప్పుల ఫైర్
కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 18 : ధాన్యం కొనుగోళ్లు, సంక్షేమ హాస్టళ్ల టెండర్లలో జరిగిన భారీ అవినీతిపై సమాధానం చెప్పకుండా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మాజీ మంత్రి కొప్ప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మపురి నియోజకవర్గంలోని ఇసుక రీచ్‌లు మాయమయ్యాయన్న అంశం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈమేరకు మంత్రిపై ఈశ్వర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ధైర్యం ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నో కష్టాలు పడి ఎమ్మెల్యేగా గెలిచిన లక్క్ష్మణ్‌కు రాజీనామా చేసే ధైర్యమే లేదని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావును ’దొర’ అంటూ కులాన్ని ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హాయాంలో కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఏనాడూ సంక్షేమ పథకాలు ఆపలేదని గుర్తు చేశారు. రైతు బీమా ప్రీమియం గడువు పూర్తయి నాలుగు నెలలు అయిందని, రైతులు చనిపోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతు డిస్కం పేరుతో రైతులకు విద్యుత్తు కోతలు విధించనున్నారని ఆరోపించారు. రిజర్వాయర్లు, మెయిన్ కెనాల్స్ పూర్తి చేసి వేల ఎకరాలకు నీరిచ్చిన ఘనత బీఆరఎస్ ప్రభుత్వానిదేనని, పిల్ల కాల్వలు పూర్తి చేస్తే మరిన్ని ఎకరాలకు నీరు అందించవచ్చని అన్నారు. రైతులను వేధిస్తున కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్న కాంగ్రెస్ ఓటమి అంచున ఉందన్నారు. రాష్ట్రం బాగుండాలంటే బీఆరఎస్ మళ్లీ గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఈశ్వర్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





