ఊహలు, కలలు రెండు వైపులా పదును ఉన్న కత్తులు. అవి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేమాట ఎంత నిజమో, మత్తును, మభ్యపాటును, ఆత్మవంచన ను కలిగించే మాట కూడా అంత నిజం. కోలుకోలేని ఓటమి వాస్తవ ప్రపంచంలో ఎదుర య్యాక, ఏదో ఒక అవాస్తవ ఊహను కావులిం చుకుంటే తప్ప, మనోవ్యాధి తీరదు. తెలంగాణ రాష్ట్రమూ, కెసిఆర్ ప్రభుత్వమూ వచ్చిన కొత్తల్లో, వాటిని సొంత, అవమానకర ఓటములుగా భావించిన శక్తులు, కొన్ని పగటికలలు కనేవి. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి కార్పొరేట్లు భయపడుతున్నారని, ఆంధ్రా పెట్టుబడిదారులందరూ తట్టాబుట్టా సర్దుకుని ఆదాయంతో సహా తరలివెడుతున్నారని చెప్పుకున్నారు, చేతిలో మీడియా ఉంటే రాసుకున్నారు, చూపుకు న్నారు. తెలంగాణ అంధకారంలోకి వెళ్లబోతోందని ఆనందంగా విచారపడ్డారు. ఇదంతా ఉక్రోషం అని తెలిసిపోతూనే ఉంది. రాష్ట్రం ఏర్పాటును అయితే తిరగదోడలేరు కానీ, కెసిఆర్ ఓడిపోవచ్చు, దిగిపోవచ్చు, పడిపోవచ్చు కదా? చూస్తే, తెలంగాణ సమాజం సంబరంలో ఉంది.
కెసిఆర్ మీద వ్యతిరేకత పెరగాలంటే సమయం పడుతుంది. ఎన్నికలా ఇప్పట్లో రావు. అప్పటిదాకా అవమానాగ్నిని భరించడం ఎట్లా అని కొందరు అపర సుయోధనులు మథన పడ్డారు. ఊహలకు పదును పెట్టారు. తమకు ఆత్మసంతృప్తి కలగడానికి సహేతుకమైన భ్రమ ఒకటి కావాలి కాబట్టి, కెసిఆర్ కు తీవ్ర అనారోగ్యం అని, ఫలానా ఏమో అనీ, రహస్య చికిత్సలో ఉన్నారని, ఎంతకాలమో చెప్పలేమనీ అనుమానాలు ప్రచారంలో పెట్టారు. గుంపుల్లో అయితే చెవుల్లో, పత్రికల్లో అయితే సూచనాత్మకంగా, సోషల్ మీడి యాలో అయితే అదిగో పులి, ఇదిగో తోక అన్నట్టు, తమ అభిలాషాత్మక ఆందో ళనను వ్యక్తం చేయసాగారు. ఈ కలలు కన్న తరువాత ఎన్నికల్లో కూడా కెసిఆర్ గెలిచారు. ఆరోగ్యం సంగతా, పదేళ్లు దాటింది, కెసిఆర్ దుక్కలా ఉన్నారు.
కానీ, ఈ కథనాలతో ఒక సమస్య ఉంది. రేవంత్ రెడ్డి ఎట్లా పడిపోతారు? కాంగ్రెస్‌కు సొంతంగానూ, అరువుగానూ వచ్చిన బలంలో గణనీయమైన భాగాన్ని ఎవరైనా ఒక షిండే తనతోపాటు బయటకు రప్పించగలగాలి. అతనికి బిఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందా? కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో ముగ్గురు నలుగురు నాయకులకు లేదా మంత్రులకు విధేయ ఎమ్మెల్యేల బృందం ఉంది. వారిలో ఎవరు తిరుగుబాటు చేస్తారు? ఓ ఇరవై మంది దాకా వస్తే కదా, బిఆర్‌ఎస్, బిజెపి కలిసి మెజారిటీ ఏర్పడేది? బిజెపి ఇటువంటి పథకానికి తల వూపుతుందా? బిఆర్‌ఎస్ కు పునరుజ్జీవం ఇచ్చే వ్యూహం ఏదైనా బిజెపికి సమ్మతం అవుతుందా? రేవంత్ రెడ్డి దిగిపోతాడు అనే మాట ఎంతో సంచలనాత్మకంగా, మీడియారంజకంగా ఉంది కానీ, దానితో ముడిపడిన సమస్యలు చూస్తే మాత్రం అదంతా అసాధ్యమైన ఊహలా అనిపిస్తుంది.
ఎన్నికలకు ఎన్నికలకు మధ్యకాలంలో, చురుకుగా జరిగే సంఘటనలు, సంచ లనాలు లేకపోతే, రాజకీయ జీవులకు బాగా చిరాకుగా
ఉంటుంది. ఏదో జరుగుతూ ఉండాలి. జరిగిపోవాలి. ముఖ్యంగా, ఓడిపోయినవారికి, చాలా సమస్య. ఎన్నికల్లో మాత్రమే ప్రభుత్వాలు మారాలంటే ఎట్లా? అన్యాయం కదా? అప్పటికి కొద్దిరోజుల ముందే కొత్త పార్టీ జనం ఆమోదాన్ని పొంది ఉంటుంది. దానికి అర్జెంటుగా ప్రజావ్యతిరేకత వచ్చి తీరాలని ఓడిపోయిన పార్టీకి కోరికగా ఉంటుంది. కానీ, దాన్ని నిరూపించే సందర్భాలు అంత తొందరగా రావు కదా? అందుకని, ఏవోవో అనూహ్యమైన పరిణామాలు జరిగి, పరిస్థితి తలకిందులైపోవాలంతే. కలల కార్ఖానా పనిచేయాల్సిందే, మరో మార్గం ఉండదు.
అటువంటి ఒక ఫేంటసీయే, ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో తచ్చాడుతోంది. అది, రేవంత్‌రెడ్డి కి పదవీగండం ఉందని. అయితే, ఇది కెసిఆర్ కు అనారోగ్యం అన్నంత అభూతకల్పన కాదు. అట్లాగని, పగటికల పాలు ఇందులో తక్కువేమీ కాదు. మరీ తలాతోకా లేని కథ కాదు. కానీ, మొత్తం మీద కథే. ఈ ఊహను ప్రచారంలో పెట్టింది, లేదా నమ్ముతున్నది ఒక్క ప్రతిపక్ష బిఆర్ ఎస్ మాత్రమే కాదు. కాంగ్రెస్ లో కూడా కొందరు సొంతంగా ప్రచారం చేయకపోయినా, చెవులప్పగించి వింటు న్నారు. ఏ పక్షమూ కానివాళ్లు, ఏ రాయి అయినా ఒకటే అనుకునేవాళ్లూ కూడా ఓహో అంటున్నారు తప్ప అసాధ్యం అనడం లేదు. పడగొడితే , మేం కదా ఆ పనిచేయవలసింది అన్నట్టుగా బిజెపి వారు, ఈ విషయంలో గుంభనంగా ఉంటున్నారు.
అయితే, ఈ ఊహలు, కల్పనలు అమాయకమైన ఆత్మసంతృప్తి పద్ధతులు కావు. ఇవి వదంతులుగాసంచరిస్తూ ఆయుధాలుగా మారుతాయి. ప్రత్యర్థులతో మేధాక్రీడలు ఆడతాయి. అదిగో బిఆర్‌ఎస్ వాళ్లంతా మాలోకి దూకబోతున్నారు, మూడిరట రెండువంతులు వచ్చేస్తారు చూడండి అంటే ఏడాది కింద రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చేసిన హడావుడి చూస్తే, నిజంగానే అట్లా జరుగుతుం దేమోనన్న అనుమానాలు వచ్చాయి. కెసిఆర్ తరువాత ఆ పార్టీలో ఆ నాలుగైదారు పేర్లు తప్ప, అమ్మకానికి లేనిదెవరు? అటువంటి సరుకునే కదా, ఆయన కూడా తీర్చిదిద్దింది!
ఈ మొత్తం దృశ్యంలో బిజెపి ఒక పాత్రధారిగా కనిపించడం లేదు. కారణాలు రెండు మూడు ఉండవచ్చు. ఒకటి, తెలంగాణ ను తమ ఖాతాలో వేసుకోవడానికి అమిత్‌షా దగ్గర ఒక ప్రత్యేకమైన వ్యూహం ఉండి ఉంటుంది, అందులో రాష్ట్ర బిజెపికి పెద్ద పాత్ర ఉండదు. రేవంత్ రెడ్డిని పడగొట్టి కానీ, ఆయననే తమ వైపు చేర్చుకుని కానీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశ్యం బిజెపికి లేదు. రెండు, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పరస్పరం నిందించుకుంటూ వీలయినంత అపఖ్యాతి పాలవుతే, అది తమకే ఉపయోగం అనుకోవడం. మూడు, రాష్ట్ర బిజెపిలో సమస్యలేమీ తక్కువ లేవు. ఆ పార్టీ క్రియాశీల పాత్ర నిర్వహించడానికి ఆ సమస్యలే అవరోధంగా ఉన్నాయి. రాష్ట్ర బిజెపి చీఫ్ ను నియమించలేకపోవడం, ఆ పార్టీ పరిస్థితికి ఒక సూచిక.
అనర్హత బోనులో నిలబడ్డ వాళ్లు బాహాటంగానే గోడదూకారు. తక్కినవారికి బేరం కుదరలేదు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో అధికారపార్టీ బండి తప్పిపోగూడదన్న టెన్షన్ కలిగించడానికి, రాష్ట్ర ప్రజల్లో బిఆర్‌ఎస్ అధఃపతనం తప్పదన్న అభిప్రాయం ఏర్పడడానికి సామూహిక ఫిరాయింపు కథనాలు, ఊహలు పనికి వచ్చాయి. ఎట్లా అయితేనేం, బిఆర్‌ఎస్ ఆ గండం గట్టెక్కింది. గౌరవనీయమైన బలంతోనే ఆ పార్టీ ఉనికిలో ఉంది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రాజకీయ ఆచరణ చేస్తున్నది, దానితో ఊహాత్మక కథనాలనూ ప్రచారంలో పెడుతున్నది. మైండ్ గేములు ఆడుతున్నది. రేవంత్ రెడ్డి గురించిన కథనాలు ఎక్కువ గా ఆ పార్టీ శ్రేణులనుంచే వస్తున్నాయి.
కానీ, ఈ కథనాలతో ఒక సమస్య ఉంది. రేవంత్ రెడ్డి ఎట్లా పడిపోతారు? కాంగ్రెస్‌కు సొంతంగానూ, అరువుగానూ వచ్చిన బలంలో గణనీయమైన భాగాన్ని ఎవరైనా ఒక షిండే తనతోపాటు బయటకు రప్పించగలగాలి. అతనికి బిఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందా? కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో ముగ్గురు నలుగురు నాయకులకు లేదా మంత్రులకు విధేయ ఎమ్మెల్యేల బృందం ఉంది. వారిలో ఎవరు తిరుగుబాటు చేస్తారు? ఓ ఇరవై మంది దాకా వస్తే కదా, బిఆర్‌ఎస్, బిజెపి కలిసి మెజారిటీ ఏర్పడేది? బిజెపి ఇటువంటి పథకానికి తల వూపుతుందా? బిఆర్‌ఎస్ కు పునరుజ్జీవం ఇచ్చే వ్యూహం ఏదైనా బిజెపికి సమ్మతం అవుతుందా? రేవంత్ రెడ్డి దిగిపోతాడు అనే మాట ఎంతో సంచలనాత్మకంగా, మీడియారంజకంగా ఉంది కానీ, దానితో ముడిపడిన సమస్యలు చూస్తే మాత్రం అదంతా అసాధ్యమైన ఊహలా అనిపిస్తుంది.
రహస్యాలేమున్నాయి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు విధేయులైన కాంగ్రెస్‌వాదులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ వాదే కానీ, బిఆర్‌ఎస్ ప్రభుత్వంతో స్నేహసంబంధాలలోను, గతంలో సోదరుడి ద్వారా బిజెపితో పరిచయ సంబంధాలలోను ఉన్నారు. ఆయన తన ప్రయోజనాల విషయంలో, రాజకీయ అవకాశాల విషయంలో వాస్తవ దృష్టితో వ్యవహరిస్తారని పేరుంది. రేవంత్ ప్రభుత్వంలో ఆయన పనులు బాగానే జరిగిపోతున్నాయని చెబుతారు. ఇక మిగిలినది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన తన బలగంతో ఒత్తిడులు తేగలరు కానీ, ప్రభుత్వాలను దించే పెద్ద పథకాలు వేసే సాహసం చేస్తారనిపించదు. తనకు వ్యతిరేకంగా పదిమంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారని వచ్చిన వార్తలు ఆయనను బలహీనపరిచాయో లేదో కానీ, బాగానే కలవరపరిచాయి. ఇక్కడి సమస్యల నుంచి ఎడంగా ప్రశాంతంగా ఉండడానికే ఆయన అమెరికాకు వెళ్లారని చెప్పుకుంటున్నారు.
కాకపోతే, స్తబ్ధరాజకీయంలో ఈ ఊహలూ కలలే రాజకీయవాదులకు ఆసరాలు. ప్రజలకు కాలక్షేపాలు. బిఆర్‌ఎస్ తో ఒక కాంగ్రెస్ చీలికవర్గం చేరడం అనే అసాధ్యపరిణామం జరిగితే తప్ప, తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అస్థిరతకు లోనయిత అందువల్ల ప్రయోజనం ఎవరికి అన్నది ప్రశ్న. ఒకవేళ రాజీనామాల తీర్పు కారణంగా పెద్ద సంఖ్యలో ఉప ఎన్నికలు వస్తే, రాష్ట్ర పరిస్థితులను అంచనావేసేందుకు అదొక సూచిక అవుతుంది. బిఆర్‌ఎస్ కు కూడా ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎదుర్కొనగలిగే సంసిద్ధత ఉన్నదని చెప్పలేము. యథాతథ స్థితిలోనే భద్రత ఉన్నదనుకుంటే, ఎవరికి వారు సేఫ్ గేమ్ మాత్రమే ఆడతారు. వుత్తుత్తి యుద్ధాలే చేస్తారు.
తెలంగాణ కాంగ్రెస్ లోని అంతర్గత స్పర్థలు మాత్రమే కాక, అధిష్ఠానం నుంచి కూడా రేవంత్ కు సమస్యలు ఉన్నాయని బిఆర్‌ఎస్ శ్రేణులు అంటున్నాయి. రేవంత్ రెడ్డి పనితీరు మీద రాహుల్ గాంధీ అసంతృప్తితో ఉన్నారని, ప్రధానినైనా రేవంత్ సులువుగా కలవగలు గుతున్నారని కానీ, రాహుల్ దర్శనం దొరకడం లేదని కొన్ని పత్రికాకథనాలు వచ్చాయి. అధిష్ఠానం పరిశీలకురాలిగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ ను నియమి ంచడం కూడా రేవంత్ మీద నిఘా పెంచడానికేనని కూడా విశ్లేషించినవారున్నారు. ఇప్పటికీ రాహుల్ గాంధీకి రేవంత్ మీద నమ్మకం సడలలేదని, రాష్ట్ర కాంగ్రెస్ లో ఎవరికీ లేనంత పలుకుబడి రేవంత్ కే ఉండని ప్రతికథనాలు వినిపిస్తున్నాయి. మీనాక్షి నియామకం రేవంత్ మీద ఫిర్యాదు వల్ల కాదని, దీపాదాస్ మున్షి మీద వచ్చిన ఆరోపణల కారణంగానేనని చెబుతున్నారు.
ఈ మొత్తం దృశ్యంలో బిజెపి ఒక పాత్రధారిగా కనిపించడం లేదు. కారణాలు రెండు మూడు ఉండవచ్చు. ఒకటి, తెలంగాణ ను తమ ఖాతాలో వేసుకోవడానికి అమిత్‌షా దగ్గర ఒక ప్రత్యేకమైన వ్యూహం ఉండి ఉంటుంది, అందులో రాష్ట్ర బిజెపికి పెద్ద పాత్ర ఉండదు. రేవంత్ రెడ్డిని పడగొట్టి కానీ, ఆయననే తమ వైపు చేర్చుకుని కానీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశ్యం బిజెపికి లేదు. రెండు, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పరస్పరం నిందించుకుంటూ వీలయినంత అపఖ్యాతి పాలవుతే, అది తమకే ఉపయోగం అనుకోవడం. మూడు, రాష్ట్ర బిజెపిలో సమస్యలేమీ తక్కువ లేవు. ఆ పార్టీ క్రియాశీల పాత్ర నిర్వహించడానికి ఆ సమస్యలే అవరోధంగా ఉన్నాయి. రాష్ట్ర బిజెపి చీఫ్ ను నియమించలేకపోవడం, ఆ పార్టీ పరిస్థితికి ఒక సూచిక.
దిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసి చిరునవ్వులు చిందించడంలో రేవంత్ రెడ్డికి ఏదైనా ప్రత్యేక ఉద్దేశ్యాలున్నాయా తెలియదు. రాష్ట్రప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడానికి కెటిఆర్ పదేపదే కేంద్రమంత్రులను కలవడంలో ఏ సందేశం ఉందో తెలియదు. ఎదుటివారు బిజెపికి దగ్గర అన్న అభిప్రాయాన్ని పరస్పరం ప్రచారం చేసుకోవడమే విచిత్రం. ముఖ్యమంత్రి పదవిలోఉండి, కాంగ్రెస్ అధినేతకు సన్నిహితులై ఉండి రేవంత్ మరోవిధంగా ఆలోచించడం ఎట్లా సాధ్యపడుతుందో అర్థం చేసుకోలేము. అట్లాగే, అత్యవసరమైతే తప్ప బిజెపితో కలయిక ఆత్మ హత్యా సదృశమని తెలిసిన కెసిఆర్ కానీ, కెటిఆర్ కానీ ఆ పనికి పాల్పడతరా అన్నది సందేహమే కానీ, బిజెపి బిఆర్‌ఎస్ కలసి పనిచేస్తున్నాయని, మున్ముందు పొత్తు ఖాయమని ఒక రాజకీయ ఊహ మాత్రం బలంగా వ్యాపించి ఉంది. బిఆర్‌ఎస్ ను ఖాలీ చేసి, ఆ స్థానాన్ని తాను భర్తీ చేయాలని అనుకుంటున్న బిజెపి తిరిగి బిఆర్‌ఎస్ కు ఎందుకు ఆస్కారం ఇస్తుంది?
కాకపోతే, స్తబ్ధరాజకీయంలో ఈ ఊహలూ కలలే రాజకీయవాదులకు ఆసరాలు. ప్రజలకు కాలక్షేపాలు. బిఆర్‌ఎస్ తో ఒక కాంగ్రెస్ చీలికవర్గం చేరడం అనే అసాధ్యపరిణామం జరిగితే తప్ప, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అస్థిరతకు లోనయితఅందువల్ల ప్రయో జనం ఎవరికి అన్నది ప్రశ్న. ఒకవేళ రాజీ నామాల తీర్పు కారణంగా పెద్ద సంఖ్యలో ఉప ఎన్నికలు వస్తే, రాష్ట్ర పరిస్థితులను అంచనా వేసేందుకు అదొక సూచిక అవుతుంది. బిఆర్‌ఎస్ కు కూడా ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎదుర్కొనగలిగే సంసిద్ధత ఉన్నదని చెప్పలేము. యథాతథ స్థితిలోనే భద్రత ఉన్నదనుకుంటే, ఎవరికి వారు సేఫ్ గేమ్ మాత్రమే ఆడతారు. వుత్తుత్తి యుద్ధాలే చేస్తారు.




