– ‘బస్తీ బాట’లో భద్రతా ప్రమాణాల పరిశీలన
చేవెళ్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : చేవెళ్ల సెక్షన్ పరిధిలోని మల్కారం గ్రామంలో గురువారం నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ విద్యుత్ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యుత్ లైన్ల నిర్వహణ, స్తంభాలపై పనులు నిర్వహించే సమయంలో సిబ్బంది అనుసరించాల్సిన భద్రతా విధానాలను స్వయంగా పరిశీలించే ఉద్దేశంతో సీఎండీ విద్యుత్ స్తంభాన్ని ఎక్కి సేఫ్టీ పరికరాల వినియోగం, పని విధానాలు, భద్రతా జాగ్రత్తల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండరాదని, ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) వినియోగించాలని, సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సీఎండీ సూచించారు. ఉద్యోగుల ప్రాణ భద్రతే సంస్థకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
పాటిల్ నిబద్ధత ప్రశంసనీయం : డిప్యూటీ సీఎం
స్వయంగా విద్యుత్ స్తంభం ఎక్కి క్షేత్రస్థాయి పరిస్థితులు, సిబ్బంది భద్రతా ప్రమాణాలను పరిశీలించిన ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ నిబద్ధత ప్రశంసనీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. క్షేత్రస్థాయిలో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ సిబ్బంది భద్రతకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




