న్యూదిల్లీ, సెప్టెంబర్ 3 : న్యాయ విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే చట్టపరమైన అధికారం భారత బార్ కౌన్సిల్(బీసీఐ)కు లేదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఈమేరకు నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులకు భారీ ఊరటనిస్తూ కీలక తీర్పు వెలువరించింది. బీసీఐ అధికార పరిధి కేవలం న్యాయవాదులుగా నమోదైన వారికి మాత్రమే పరిమితమని, విద్యార్థి దశలో ఉన్నవారికి ఇది వర్తించదని ధర్మాసనం తేల్చి చెప్పింది. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా.. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని నల్సార్ వైస్-ఛాన్సలర్‌ను ఆదేశించారు. అంతటితో ఆగకుండా నల్సార్ 2026 బ్యాచ్‌కు చెందిన ఏ విద్యార్థినీ న్యాయవాదిగా నమోదు చేసుకోవద్దని దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు సర్క్యులర్ జారీ చేశారు. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు రావడంతో మనన్ కుమార్ మిశ్రా ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. అయినా ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బీసీఐ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన ధర్మాసనం పై విధంగా తీర్పునిచ్చింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



