నేపాల్ బాధితులకు అండగా నిలిచిన సోనూసూద్

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 4 : తీవ్ర వరదలతో అల్లాడుతున్న నేపాల్ ప్రజలను ఆదుకునేందుకు ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ రంగంలోకి దిగారు. బాధితులకు అవసరమైన దుప్పట్లు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర సరుకులను భారత్ నుంచి తరలించి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, సోనూసూద్ నేపాల్ పర్యటనపై ప్రముఖ జర్నలిస్ట్ అజిత్ అంజుమ్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. పనులు ఇంకా ప్రారంభం కాకముందే ఆయనను దేవుడిగా చిత్రీకరిస్తూ ప్రచారం చేసుకోవడం కేవలం సెల్ఫ్ మార్కెటింగ్ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టడం కలకలం రేపింది. అయితే ఈ ప్రతికూల విమర్శలపై సోనూసూద్ ఎంతో హుందాగా, సానుకూలంగా స్పందించారు. ‘సోదరా.. మీ మనసు చాలా మంచిది. మీరు నేపాల్‌కు రండి, మనమిద్దరం కలిసి ప్రజలకు అండగా నిలబడి సాయం చేద్దాం’ అంటూ రీట్వీట్ చేశారు. సోనూసూద్ చూపించిన ఈ సంస్కారం, పరిణతిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా, త్రిశూలి నది పరివాహక ప్రాంతాల్లో వరద విధ్వంసం తీవ్రంగా ఉందని, బాధితుల ఇళ్లను పునర్నిర్మించి వారు సాధారణ జీవితం గడిపే వరకు కొన్ని నెలలపాటు తమ సూద్ ఫౌండేషన్ తరఫున సహాయక చర్యలు కొనసాగుతాయని సోనూసూద్ స్పష్టం చేశారు. పరాయి దేశంలోనూ మానవత్వాన్ని చాటుకుంటూ ఆయన అందిస్తున్న సేవలకు అంతటా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *