ఖర్గే తదితరులు శ్రద్ధాంజలి
నేడు ఎఐసిసి కార్యాలయానికి పార్థివదేహం
న్యూదిల్లీ, డిసెంబర్ 27 : భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ (92) పార్థివ దేహానికి కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అపారమైన జ్ఞానం, సమగ్రతతో భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. ఆయనలోని వినయం, ఆర్థికశాస్త్రంపై ఆయనకున్న లోత్కెన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చాయి.
నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఓ గురువును కోల్పోయాను‘ అని అన్నారు. ప్రియాంకా గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. మన్మోహన్ ఎల్లప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేసేవారని పేర్కొన్నారు. ఆర్థిక విషయాలపై ఆయనకు చాలా జ్ఞానం ఉందని అన్నారు. మన్మోహన్ సింగ్ యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీతో, గాంధీ కుటుంబంతో మన్మోహన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. గురువారం రాత్రి ఆయన మరణవార్త తెలియడంతో కర్ణాటకలోని బెళగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలను అర్ధంతరంగా ముగించి..
మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వెంటనే దిల్లీకి బయలుదేరారు. దిల్లీలోనే ఉన్న సోనియా, ప్రియాంక హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు.శనివారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడిరచారు. దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మన్మోహన్ పార్థివ దేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు. ప్రజల సందర్శనార్థం శనివారం ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురా నున్నారు. రాజ్‌ఘాట్ సవిరీపంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిరచాయి.