దేశం గొప్ప కుమారుడిని కోల్పోయింది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్ ప్రజాతంత్ర డిసెంబర్ 27 : మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తీవ్ర మృతి రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ మృతితో దేశం గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తని కోల్పోయిందిన విచారం వ్యక్తం చేశారు. రాజకీయ, ప్రజా జీవితానికి మర్యాద ఎంత అవసరమో చూపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశ రాజకీయాల్లో ఓ లెజెండ్ అని, దేశం కోసం నిష్కళంకమైన, సమగ్రమైన నిర్ణయాలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
సద్గుణం, నిష్కళంకమైన సమగ్రత, నిర్ణయం తీసుకోవడంలో అన్నింటికంటే మానవీయ స్పర్శతో గుర్తించబడిన వ్యక్తి, డాక్టర్ సింగ్ కొత్త భారతదేశానికి నిజమైన వాస్తు శిల్పుల్లో ఒకరు అని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. రాజకీయ, ప్రజా జీవితానికి మర్యాద, పద్ధతి ఎంత అవసరమో ఆయన చూపించారు. మన్మోహన్ ఒక లెజెండ్, ఆయన మరణంతో భారతదేశం ఒక గొప్ప కొడుకును కోల్పోయిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. మన్మోహన్ కుటుంబసభ్యులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.