– తప్పిన ప్రమాదం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : యదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు, మంటలు చెలరేగడంతో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వైపు వెళ్తున్న రైలును బీబీనగర్ లో డ్రైవర్ నిలిపివేశారు. బ్రేక్ లైనర్లు పట్టుకోవడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. పొగలను కో-పైలట్ గుర్తించి వెంటనే అప్రమత్తం చేయడంతో రైలును నిలిపివేసి సిబ్బంది చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




