సామాజిక బహిష్కరణలపై బీసీ కమిషన్ కు ఫిర్యాదులు

– విజ్ఞాపనలు సమర్పించిన బాధితులు

నిజామాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : సామాజిక బహిష్కరణ ఉదంతాలపై తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ నేతృత్వంలో సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, బాలలక్షి లతో కూడిన బృం దం బుధవారం నిజామాబాద్లోని కలెక్టరేట్లో బాధితులతో భేటీ అయ్యింది. ఐ.డీ.ఓ.సీకి చేరుకు న్న కమిషన్ ప్రతినిధులను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ వి. భుజంగరావు తదితరులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాంఘిక, కుల బహిష్కరణలకు గురైన బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కమిషన్ చైర్మన్, సభ్యులకు లిఖితపూర్వకంగా విజ్ఞాప నలు సమర్పించారు. బాధితులు నిర్భీతితో, స్వేచ్ఛగా వారి అభిప్రాయాలను వెల్లడించేందుకు వీలు గా తగిన ఏర్పాట్లు చేశారు. దీంతో జిల్లాలోని ఆయా ప్రాంతాలలో గ్రామాభివృద్ధి కమిటీల పేరిట కొనసాగుతున్న అరాచకాల గురించి, సామాజిక బహిష్కరణ ఘటనలను బాధితులు కమిషన్ కు ఏకరువు పెట్టారు. బీసీ కుల సంఘాల నాయకులు, వివిధ వర్గాల వారు, ప్రజా సంఘాల ప్రతినిధు లు సైతం హాజరై రాతపూర్వకంగా విజ్ఞాపనలు కమిషన్ కు అందిస్తూ, మౌఖికంగా కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. సాంఘిక బహిష్కరణలపై ఫిర్యాదులు సమర్పించేందుకు హాజరైన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *