– కలెక్టర్ భవేశ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం
– హెచ్ఎం సస్పెన్షన్
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : తానూర్ మండలంలోని బెంబర్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ సమయం ముగిసిన తర్వాత రెండో తరగతి విద్యార్థిని తరగతి గదిలోనే ఉండిపోయింది. ఈ విషయాన్ని గుర్తించకుండానే సిబ్బంది తరగతి గదికి తాళం వేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానో పాధ్యాయురాలు డి. స్వప్నను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన స్కావెంజర్ను సైతం విధుల నుంచి తొలగిస్తూ చర్యలు చేపట్టారు. పాఠశాల ముగిసే సమయంలో ప్రతి విద్యార్థి సురక్షితంగా బయటకు వెళ్లారా లేదా అనేది ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా నిర్ధా రించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో భద్రతా చర్యలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




