కిట్స్‌లో ‘స్మార్ట్ సిస్టమ్ డిజైన్’ వర్క్‌షాప్ ప్రారంభం

హన్మకొండ, ప్రజాప్రతంత్ర, అక్టోబర్ 9: వరంగల్ కిట్స్‌లోని ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో వరంగల్‌కు చెందిన జిజిబిమాడ్‌బిసెహావి ఏఐఓటి సొల్యూషన్స్‌ సహకారంతో రెండు రోజులపాటు నిర్వహించనున్న ‘ఆర్డుయినో, సెన్సార్లను ఉపయోగించి స్మార్ట్ సిస్టమ్ డిజైన్’ వర్క్‌షాప్ కిట్స్ క్యాంపస్‌లోని సివిల్ సెమినార్ హాల్‌లో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అతిథి, జిజిబిమాడ్‌బిసెహావి ఏఐఓటి సొల్యూషన్స్ సీఈఓ ఆకాష్, ధనుష్, మోక్షిత్‌లతో కలిసి ఈ వర్క్‌షాప్‌కు రిసోర్స్ పర్సన్స్‌గా వ్యవహరిస్తున్నారు. వీరు ఆర్డుయినో ప్రోగ్రామింగ్, సెన్సార్ ఇంటర్‌ఫేసింగ్, స్మార్ట్ సిస్టమ్ డిజైన్, రియల్-టైమ్ అప్లికేషన్స్‌పై ఆచరణాత్మక శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ జి.రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ ఆర్డుయినో ప్రోగ్రామింగ్, సెన్సార్ ఇంటర్‌ఫేసింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటి), స్మార్ట్ సిస్టమ్ డిజైన్‌లో విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని అన్నారు. పరిశ్రమల మారుతున్న అవసరాలను తీర్చడానికి ఇంజనీరింగ్ విద్యార్థులకు సాంకేతికతలపై ఆచరణాత్మక అనుభవం చాలా అవసరమని ఆయన చెప్పారు. కార్యక్రమంలో విభాగపు అకడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎ.శ్రీనివాస్(సహ-కన్వీనర్), వర్క్‌షాప్ ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్లు డాక్టర్ ఎం.రాజు, పి.రామచందర్ రావు, అలాగే ఎ.పవన్, డాక్టర్ కె.సౌజన్య, డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ ముకీమ్, ఇ.సుస్మిత, వివిధ విభాగాల డీన్‌లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, రసాయన శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పీఆర్వో డాక్టర్ డి.ప్రభాకరాచారి, విద్యార్థులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *