– నల్లగొండలొ నలగురి అనుమానాస్పద మృతి కేసులో
నల్గొండ, ప్రజాతంత్ర, జూన్ 25: జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. భార్యాభర్తలు మహ్మద్ సుల్తాన్(45), హసీనా(38), కుమారుడు ముజామిల్(20), కూతురు అఫోర(14)ను నిందితులు విచక్షణారహితంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. సుపారీ గ్యాంగ్‌లోని ఆరుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు సమాచారం. కుటుంబ గొడవలు, ఆస్తి తగాదాలే హత్యలకు కారణంగా భావిస్తున్నారు. ఈనెల 22న హత్యలు జరగ్గా.. ఘటనాస్థలిలో ఏ ఒక్క ఆధారం లభ్యం కానప్పటికీ పోలీసులు తీవ్రంగా శ్రమించి .. సుపారీ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పదునైన ఆయుధంతో దాడిచేసి హత్య చేసినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలిందని పోలీసులు తెలిపారు. నగరంలోని ప్రకాశం బజార్‌లో సుల్తాన్ బ్యాగులు విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. దంపతుల మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మద్యం తాగి తరచూ ఇంటికి వచ్చి సుల్తాన్ గొడవ పెట్టుకునేవారని స్థానికులు చెబుతున్నారు. వీరి కుమారుడు ముజామిల్ ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. హసీనా ఓ ప్రైవేటుపాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కుమార్తె అఫోర ఇదే పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. సుల్తాన్ మొదటి భార్య మృతిచెందింది. హసీనాతో రెండో వివాహం కాగా ఈ పిల్లలిద్దరూ సుల్తాన్ మొదటి భార్య పిల్లలని స్థానికులు చెబుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





