~ సహకరించిన భార్య
~ ప్రాణాపాయ స్థితిలో అల్లుడు
~ కేసు నమోదులో పోలీస్ ల జాప్యం
హసన్ పర్తి, ప్రజాతంత్ర, జూన్ 25: ఇంటికి వచ్చిన అల్లుడిని నమ్మించి అత్త, మామ, భార్య కలిసి గొంతు కోసి హత్యాయత్నం చేసిన సంఘటన హసన్ పర్తి మండలం నాగారంలో జరిగింది. బాధితుని తండ్రి కోనేటి సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. భీమారంనకు చెందిన తన కుమారుడు అనిల్ కుమార్ దుబాయ్ లోని మెట్రో కంపెనీలో సీఈవోగా పనిచేస్తున్నాడు. భార్య నవ్య శ్రీ, కొడుకు అవ్యం తేజ్ ఉన్నారు. వీరు దుబాయ్ లోనే ఉంటున్నారు. అమెరికా -ఇరాన్ యుద్ధం కారణంగా అనిల్ కుమార్ తన భార్య, కొడుకులను అత్తగారిల్లు నాగారం తీసుకువచ్చాడు. వెంటనే మళ్ళీ ఉద్యోగరీత్యా దుబాయ్ కి వెళ్ళాడు. ఇప్పుడు భార్య ఆ పిల్లలను దుబాయి కి తీసుకొని వెళ్లడానికి మంగళవారం నాగారంకు వచ్చిన క్రమంలో బుధవారం రాత్రి అత్త పులిసేరు భాగ్య, మామ పులిసెరు చిన్నోడు, భార్య నవ్య శ్రీ, బామ్మర్ది పులి నవీన్, పెద్ద మామ పులిసెరు రవి లు కలిసి అతన్ని నమ్మించి హత్య చేయడానికి అతని గొంతును కోశారు. తప్పించుకునే క్రమంలో చేతికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బాధితుడి సోదరుడు అశోక్ హుటాహుటిన నాగారం వచ్చి చికిత్స నిమిత్త అనిల్ కుమార్ ను ఎంజీఎం కు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
కేసు నమోదులో జాప్యం
సంఘటన జరిగిన వెంటనే బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించి 24 గంటలు గడిచినా కేసు నమోదు చేయకపోవడంపై కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ఇన్‌స్పెక్టర్ ఆకునూరి మహేందర్ ను వివరణ కోరగా ప్రస్తుతం కేసు నమోదు చేయలేదు.. ఎంక్వయిరీ చేస్తున్నాము.. తర్వాత కేసు నమోదు చేస్తామని తెలిపారు.
——————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





