ట్రిపుల్‌ ‌తలాక్‌ ఉం‌డాల్సిందే

– బహుభార్యత్వం కూడా సమర్థనీయమే
– మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్‌సిపి ఎమ్మెల్యే సనా మాలిక్‌ ‌వ్యాఖ్యలు
– తిప్పికొట్టిన బిజెపి ఎమ్మెల్యేలు
– పాక్‌కు వెళ్లాలని హితవు

ముంబై, జూన్‌ 25 : ‌మహారాష్ట్ర రాజకీయాల్లో యూనిఫామ్‌ ‌సివిల్‌ ‌కోడ్‌, ‌ట్రిపుల్‌ ‌తలాక్‌ అం‌శాలపై కొత్త వివాదం చెలరేగింది. ఎన్‌సీపీ అజిత్‌ ‌పవార్‌ ‌వర్గం ఎమ్మెల్యే సనా మాలిక్‌ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అలాగే ఆమె వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు కూడా వస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే సానా మాలిక్‌ ‌చేసిన ప్రకటన కలకలం రేపింది. భారత్‌ ‌లో ఖురాన్‌ ఆధారిత చట్టాలను అమలు చేయాలని, ట్రిపుల్‌ ‌తలాక్‌ను సమర్థించాలని మాలిక్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. పాకిస్తాన్‌, ‌ఖురాన్‌, ‌ముస్లిం వ్యక్తిగత చట్టాలను ఉటంకిస్తూ, భారతదేశంలో ఇస్లామిక్‌ ‌చట్టాన్ని అమలు చేయాలని ఎన్‌సీపీ ఎమ్మెల్యే డిమాండ్‌ ‌చేశారు. పాకిస్తాన్‌ ‌లాగే, భారత్‌ ‌కూడా ఇస్లామిక్‌ ‌చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నామని ఆమె తెలిపారు. ట్రిపుల్‌ ‌తలాక్‌ను సమర్థిస్తూ సనా మాలిక్‌.. ‌విడాకులలో వివిధ రూపాలు ఉన్నాయి. తలాక్‌-ఎ-‌హసన్‌, ‌తలాక్‌-ఎ-అహ్సన్‌, ‌తలాక్‌-ఎ-‌బిద్దత్‌ అనే మూడు రకాల విడాకులు ఉన్నాయి. ట్రిపుల్‌ ‌తలాక్‌కు సంబంధించి ఆమోదించిన చట్టం, అప్పటికే ఆచరణలో విస్తృతంగా అమలులో లేని ఒక వ్యవస్థపై ఆధారపడి ఉంది. దాని ప్రస్తావన ఎక్కడా లేదు. ఆ తర్వాత బహుభార్యత్వం గురించి మాట్లాడుతూ, బహుభార్యత్వం కేవలం ఒక మతంలోనే కాకుండా, ప్రతి మతంలోనూ ప్రబలంగా ఉంది. ముస్లింలలో బహుభార్యత్వం గురించి బోధిస్తారు. దానిని పాటించాలి. దీని కోసం ఒక చట్టాన్ని రూపొందించాలని అన్నారు. తన వ్యాఖ్యలకు సంబంధించి సనా మాలిక్‌ ‌సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌చట్టం అమలుపై అసెంబ్లీలో తన అభిప్రాయాన్ని వెల్లడించానని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అన్ని మతాలకు సమానంగా వర్తించే చట్టాలు ఉండాలని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఈ అంశంపై జరిగిన చర్చలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేష్‌ ‌కదమ్‌ ‌స్పందించారని, చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత అవి అన్ని మతాలకు వర్తిస్తాయని చెప్పినట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు సనా మాలిక్‌ ‌పై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నితేష్‌ ‌రాణెళి మాట్లాడుతూ ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ, అసెంబ్లీలోని కొందరు ఖురాన్‌, ‌ముస్లిం గ్రంథాలను ఉటంకిస్తూ యూనిఫామ్‌ ‌సివిల్‌ ‌కోడ్‌ (‌యూసీసీ)ని ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. యూసీసీ గురించి రాజ్యాంగంలో ప్రస్తావించారని, ఎవరైనా దేశ చట్టాలను, రాజ్యాంగాన్ని పాటించకూడదనుకుంటే, వారు తమ పదవికి రాజీనామా చేసి పాకిస్తాన్‌కు వెళ్ళిపోవాలి అని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *