డ్రంకెన్ డ్రైవ్.. పట్టుబడ్డ వ్యక్తికి వారం జైలు

నిజామాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తికి నిజామాబాద్ ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్‌ కోర్టు ఏడు రోజుల సాధారణ కారాగార శిక్ష విధించిందని 5వ టౌన్ ఎస్సై సునీల్ వెల్లడించారు. స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన సమయంలో షేక్ హబీబ్ అనే వ్యక్తికి బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించగా అతడు మద్యం తాగినట్లు నిర్ధారణ అయినట్లు ఎస్సై వివరించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచగా కోర్టు పైవిధంగా శిక్ష విధించిందని వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని నిజామాబాద్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు డ్రైవ్ చేయవద్దని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *