– స్మార్ట్ ఫోన్లకు అలర్ట్‌లు పంపిన గూగుల్
కారకాస్, జూన్ 25 : ప్రకృతి విపత్తుతో వెనెజువెలా దేశం అల్లాడిపోతోంది. ఈ భూకంపాలు సంభవించడానికి కొన్ని క్షణాల ముందు గూగుల్ పలు స్మార్ట్‌ఫోన్లకు దీని గురించి అలర్టులు పంపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్లను నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ అలర్టులు వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత కాసేపటికే భూకంపాలు సంభవించాయి. అధునాతన స్మార్ట్‌ఫోన్లలో యాక్సిలరోవిÖటర్ అనే పరికరం ఉంది. సాధారణంగా ఇది ఒక సెన్సార్. మీరు ఫోన్‌ను అడ్డంగా పట్టుకున్నప్ప్పుడు స్క్రీన్‌ను ఆటోమేటిక్‌గా తిప్ప్పుతుంది. దీని వల్ల మరో ఉపయోగం కూడా ఉంది. ఈ సెన్సార్ ప్రకంపనాలను కూడా గుర్తించి కొలవగలదు. మనం ఉంటున్న ప్రాంతంలో భూమి నుంచి వెలువడే వైబ్రేషన్స్‌ను ఇది సేకరిస్తుంది. ఇవి భూకంపానికి దారితీసేంత బలంగా ఉంటే వెంటనే గూగుల్ ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్‌కు సిగ్నల్ పంపిస్తుంది. సుమారుగా ఏ ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం ఉందో చెబుతుంది. ఒక స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ సిగ్నల్ అందిన వెంటనే గూగుల్ సర్వర్ ఆ ప్రాంతంలోని మిగతా ఫోన్లలోని యాక్సిలరోవిÖటర్లను పరిశీలిస్తుంది. అత్యధిక ఫోన్లు ఇలాంటి ప్రకంపనలే గుర్తిస్తే వెంటనే భూకంపం వస్తుందని అంచనా వేసి ఆ ప్రాంతానికి అలర్టులు పంపిస్తుంది. ఈ పక్రియ శరవేగంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ ఉన్నట్లు గూగుల్ తెలిపింది. సాధారణంగా భూకంపం అనేది ఒక్కసారిగా వచ్చే కుదుపు కాదు. తరంగాల రూపంలో సంభవిస్తుంది. తొలుత ప్రైమరీ వేవ్స్ వస్తాయి. ఇవి సెకనుకు ఆరు కి.విÖ వేగంతో ప్రయాణిస్తాయి. ఆ తర్వాత సెకండరీ వేవ్స్.. ఇవి సెకనుకు 3`4 కి.విÖ వేగంతో పయనిస్తాయి. భూకంపం వల్ల జరిగే అత్యధిక నష్టానికి ఈ తరంగాలే కారణం. ఇక, మన స్మార్ట్‌ఫోన్లు గుర్తించేవి ప్రైమరీ వేవ్స్‌నే. ఇవి రాగానే సర్వర్‌కు సిగ్నల్ ఇస్తాయి. అందువల్ల సెకండరీ వేవ్స్ రావడానికి ముందే గూగుల్ సర్వర్లు సమాచారాన్ని సేకరించి అలర్ట్ ఇవ్వడానికి సమయం లభిస్తుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. భూకంప తీవ్రతను అంచనా వేసిన దాన్నిబట్టి ఆండ్రాయిడ్ ఫోన్లు రెండు రకాల అలర్టులు ఇస్తుంటాయి. ఒకటి ’బి అవేర్ అలర్టు’. ఇది తక్కువ తీవ్రతతో ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నప్ప్పుడు ఇచ్చే సిగ్నల్. ఇక రెండోది ’టేక్ యాక్షన్ అలర్ట’. మధ్యస్థ, తీవ్రస్థాయి భూకంపాల సమయంలో దీనిని జారీ చేస్తుంటుంది. దీన్ని టచ్ చేయగా భూకంపం వచ్చే అవకాశం ఉన్న పరిధిని చూపిస్తుంది. దీంతోపాటు విపత్తు సమయంలో సురక్షితంగా ఎలా బయటపడాలో తెలిపే కొన్ని సూచనలు చేస్తుంది. మన దేశంలోనూ 2023 నుంచి ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్ యాక్టివ్‌లో ఉంది. ఆండ్రాయిడ్ 5 అంతకంటే ఆధునిక వెర్షన్లలో ఈ ఫీచర్ ఉంది. అయితే, అలర్టులు రావాలంటే తప్పనిసరిగా ఫోన్‌లో మొబైల్ డేటా లేదా వైఫై ఆన్ చేసి ఉండాలి.
వరుస భూకంపాలను డబ్లెట్ అంటారు
కాలిఫోర్నియా, జపాన్, పుల్వామాలోనూ ప్రకంపనలు
న్యూదిల్లీ : వెనెజువెలా సమయంలో కొంచెం అటూఇటుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో (5.6), జపాన్ (7.2)లోనూ భూకంపాలు వచ్చాయి. ప్రపంచంలో ఒకే రోజు ఇలా వేర్వేరుచోట్ల పుడమి ఉగ్రరూపం దాల్చడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ భూకంపాల మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే దీనికి ’కాదు’ అనే సమాధానం ఇస్తున్నారు కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన భూకంప శాస్త్రవేత్త డాక్టర్ లూసీ జోన్స్. ఈ భూకంపాలు వేర్వేరు ఫాల్ట్ సిస్టమ్స్ (ఫలకాలు కలిసే సరిహద్దులు, పగుళ్లు), ప్లేట్ బౌండరీల్లో సంభవించాయి. అంటే వాటి మధ్య సంబంధం లేదని అర్థం. ఒకదానిని మరొకటి ప్రేరేపించలేదు. ఒకచోట సంభవించే భారీ భూకంపాలు.. వేల మైళ్ల దూరంలో మరో భూకంపానికి దారితీసే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని జోన్స్ వెల్లడించారు. ఇలా ఒకే సమయంలో వేర్వేరు చోట్ల భూమి కంపించడం అనేది యాదృచ్ఛికమేనని చెబుతున్నారు. కాగా, జమÖ్మకశ్మీర్‌లోని పుల్వామాలో 3.5 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు రాగా గురువారం తెల్లవారు జామున పుల్వామాలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం నేపాల్‌లో 15 కి.విÖ లోతున ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక, జపాన్‌లో తొలుత భూకంప తీవ్రత 6.9 అని రాగా, తర్వాత దానిని 7.2గా సవరించారు. కొన్ని సెకన్ల నుంచి నిమిషాల తేడాతో దాదాపు ఒకే తీవ్రత గల రెండు భూకంపాలు ఒకే ప్రాంతంలో సంభవించడాన్ని ’ఎర్త్‌క్వేక్ డబ్లెట’ అంటారు. ఒకసారి భూకంపం వచ్చిన తర్వాత తక్కువ తీవ్రతతో చిన్న చిన్న ప్రకంపనలు రావడం సహజమే. కానీ డబ్లెట్ విషయానికొస్తే రెండోసారి వచ్చే భూకంపం కూడా దాదాపు మొదటిదానంత తీవ్రంగా ఉంటుంది. ఇప్ప్పుడు వెనెజువెలా పరిస్థితిని శాస్త్రవేత్తలు ’ఎర్త్‌క్వేక్ డ్లబెట’గా పిలుస్తున్నారు. వెనెజువెలాలో ఈస్థాయిలో భూకంపం 1900లో వచ్చింది. దాని తీవ్రత 7.7గా నమోదైంది. దాంతో రాజధాని సవిÖప ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. మళ్లీ 2018లో 7.3 తీవ్రతతో భూమి కంపించినప్పటికీ ఆస్తి, ప్రాణనష్టం ఇప్పటితో పోలిస్తే తక్కువగానే సంభవించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





