ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై సింగరేణి జెండా

– ఖమ్మం యువ పర్వతారోహకుడు మోతికుమార్ ఘనత
– అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : అత్యంత ప్రమాదకర ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకున్న యువ పర్వతారోహకుడు మోతి కుమార్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు. సముద్ర మట్టానికి సుమారు 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బేస్ క్యాంప్‌పై సింగరేణి సంస్థ లోగో (జెండా)ను ప్రదర్శించిన మోతికుమార్‌ను ఆయన ప్రశంసించారు. బేస్ క్యాంప్ వద్ద సింగరేణి లోగోను ప్రదర్శిస్తూ తీసిన చిత్రపటాన్ని డిప్యూటీ సీఎంకు మోతీకుమార్ బహూకరించారు. భవిష్యత్తులో మోతికుమార్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తాను ఇప్పటివరకు అధిరోహించిన కిలిమంజారో, ఎల్‌బ్రస్ వంటి వివిధ అంతర్జాతీయ పర్వతాల గురించిన వివరాలను డిప్యూటీ సీఎంకు ఆయన వివరించారు. తన తదుపరి లక్ష్యం ప్రపంచంలోనే అత్యున్నత శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించడమేనని, అందుకు తగ్గట్టుగా కఠిన సాధన చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, డెరెక్టర్(పీపీ) కొప్పుల వెంకటేశ్వర్లు, జీఎం (కోఆర్డినేషన్) టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *