సిక్కిం ఆవిర్భావ దినోత్సవం

– పిల్లలతో కలసి ఫుట్‌బాల్‌ ఆడిన ప్రధాని

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 28: ‌నరేంద్ర మోదీ సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లో సందడి చేశారు. యువతతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. సిక్కిం రాష్ట్ర అవతరణ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. మంగళవారం జరగబోయే ముగింపు వేడుకల కోసం ప్రధాని గ్యాంగ్‌టక్‌ ‌చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫుట్‌బాల్‌ ఆడారు. సిక్కిం 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని మంగళవారం ఉదయం అక్కడి క్రీడాకారులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్‌ ఆడారు. ఈ ఆటకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ ‌మీడియాలో షేర్‌ ‌చేయగా వైరల్‌ అయ్యాయి. గ్యాంగ్‌టక్‌లో యువ మిత్రులతో కలిసి ఆడడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ముగింపు కార్యక్రమానికి మోదీ హాజరై రూ.4,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. ఆ రాష్ట్రం భారత యూనియన్‌లో చేరి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రోడ్‌షోలో పాల్గొన్నారు. యువతతో కలిసి క్రీడల్లో పాల్గొనడం తనకు ప్రత్యేక అనుభూతినిచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. ’గ్యాంగ్‌టక్‌లో ఉదయం యువ స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడడం చాలా ఎనర్జీ ఇచ్చిందని మోదీ పేర్కొన్నారు. కాగా, సిక్కింలో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. సిక్కింలో రహదారుల కనెక్టివిటీ, ఆరోగ్యం, టూరిజం, విద్య, నగర అభివృద్ధి సహా వివిధ రంగాల్లో రూ.4,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *