-పెంచిన ఫీజులను వాపస్ చేయాలని సర్కార్ హుకుం
చండీఘడ్, జూలై 14: పంజాబ్‌లోని ప్రైవేట్ స్కూళ్లకు అక్కడి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ఏటా 5 శాతానికి పైగా ఫీజులు పెంచిన ప్రైవేట్ పాఠశాలలు.. ఆ అదనపు మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు గత నాలుగేళ్ల ఫీజు రికార్డులను పది రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించారు. ఆ సమాచారాన్ని విద్యాశాఖ పోర్టల్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఫీజు చెల్లించలేదని మానసిక వేధింపుల కారణంగా ఇటీవల అమృత్‌సర్‌లో 17ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనను భగవంత్‌మాన్ ప్రస్తావించారు. ఈ ఘటన తర్వాత, అధిక ఫీజుల పెంపుపై తల్లిదండ్రుల నుంచి అనేక ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఆర్డినెన్స్‌ను కోర్టులో సవాలు చేసినా తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని.. ఈ విషయంలో వెనుకడుగు వేసేదే లేదని స్పష్టం చేశారు. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం.. ప్రైవేట్ పాఠశాలలు వార్షిక ఫీజులను 5శాతానికి మించి పెంచకూడదు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై రూ.50వేల నుంచి రూ.1 లక్షవరకు జరిమానా విధింపు, గుర్తింపు రద్దు వంటి చర్యలు తీసుకోనున్నారు. ఈ నిర్ణయం ద్వారా పంజాబ్‌లోని 32లక్షలకు పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రయోజనం పొందుతారని అంచనా.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





