బుల్లెట్ ‌రైళ్ల‌ ‌హబ్‌గా తెలంగాణ

– హైదరాబాద్‌, ‌చెన్నై, బెంగళూరును కలుపుతూ కారిడార్‌
‌- దేశంలో 7 బుల్లెట్‌ ‌ట్రైన్లకు మూడు తెలంగాణకే
– దేశవ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ
– ఇప్పటికే 260 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పూర్తి
– వికసిత్‌ ‌భారత్‌-2047.. ‌సాంకేతికత పాత్ర అంశంపై అశ్వినీ వైష్ణవ్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 11: తెలంగాణకు రైల్వే బడ్జెట్‌ను కేంద్రం భారీగా పెంచిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌తెలిపారు.  తెలంగాణ బుల్లెట్‌ ‌ట్రైన్స్ ‌హబ్‌గా మారబోతోందని అన్నారు.  హైదరాబాద్‌ ‌హెచ్‌ఐసీసీలో వికసిత్‌ ‌భారత్‌-2047.. ‌సాంకేతికత పాత్ర’ అనే అంశం నిర్వహించిన సదస్సులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌, ‌చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్‌ ‌ట్రైన్లు రానున్నాయని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి ఇచ్చిన రైల్వే  బడ్జెట్‌ ‌రూ.880 కోట్లు మాత్రమే.. మోదీ సర్కార్‌ ‌కేవలం తెలంగాణకే రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ను ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపట్టామని వివరించారు. ఇప్పటికే 260 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పూర్తయ్యిందని అశ్వినీ వైష్ణవ్‌ ‌తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు ఇచ్చామన్నారు. దేశంలో 7 బుల్లెట్‌ ‌ట్రైన్స్ ‌ప్రకటిస్తే.. అందులో తెలంగాణకు 3 దక్కాయని అశ్వినీ వైష్ణవ్‌ ‌తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కారణంగానే తెలంగాణకు మూడు బుల్లెట్‌ ‌ట్రైన్స్ ‌దక్కాయని వెల్లడించారు.ఇవి అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్‌ ‌నుంచి విజయవాడకు కేవలం 1 గంట 10 నిమిషాలు.. హైదరాబాద్‌ ‌నుంచి ముంబైకి 2 గంటల 20 నిమిషాలు.. హైదరాబాద్‌ ‌నుంచి చెన్నయ్‌కి రెండు గంటల్లో వెళ్లవచ్చని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ‌దేశంలో పెద్ద మార్పునకు శ్రీకారం చుట్టబోతోంది. కొంతమంది దీని క్రెడిట్‌ ‌తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రెడిట్‌ ‌కేవలం నరేంద్ర మోదీకి మాత్రమే దక్కుతుందని అన్నారు.  ’వికసిత్‌ ‌భారత్‌-2047’ ‌లక్ష్య సాధనలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని అశ్విని వైష్ణవ్‌ అన్నారు. వందేభారత్‌ ‌రైళ్లు ప్రపంచస్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందించబడ్డాయని అశ్విని వైష్ణవ్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణకు ఇప్పటికే ఐదు వందేభారత్‌ ‌రైళ్లు అందుబాటులోకి వచ్చాయని, త్వరలో మరిన్ని సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా 36,000 కి.. కొత్త రైల్వే ట్రాక్‌లు నిర్మించామని తెలిపారు. అలాగే 2,700 కి.. డెడికేటెడ్‌ ‌కారిడార్‌ ‌పూర్తి చేసినట్లు వెల్లడించారు. దేశంలోని రైల్వే నెట్‌వర్క్‌లో 99.4శాతం విద్యుద్దీకరణ పూర్తయిందని, దీంతో డీజిల్‌పై ఆధారపడటం దాదాపు పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు.  తెలంగాణకు ఇప్పటికే ఐదు వందేభారత్‌ ‌రైళ్లు అందుబాటులోకి వచ్చాయని, త్వరలో మరిన్ని సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు.

ఎలక్టాన్రిక్స్, ఐటీ, చిప్‌ ‌డిజైన్‌ ‌రంగాల్లో ముందంజ
-సెమీ కండక్టర్‌ ‌రంగంలో నైపుణ్యాలకు కొరత

ప్రపంచవ్యాప్తంగా సెకండక్టర్‌ ‌పరిశ్రమలో దాదాపు 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఉందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ ‌తెలిపారు. ఈ అవకాశాన్ని భారత్‌ ‌సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశానికి ఎలక్టాన్రిక్స్, ఐటీ, చిప్‌ ‌డిజైన్‌ ‌రంగాల్లో ఇప్పటికే బలమైన పునాది ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ’ఇండస్టీ లీడర్‌ ‌టౌన్‌ ‌హాల్‌’ ‌సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ ‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌ ‌రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో ఎలక్టాన్రిక్స్, ‌సెకండక్టర్‌, ‌బుల్లెట్‌ ‌ట్రైన్‌, ‌రైల్వే ఆధునికీకరణ వంటి రంగాల్లో జరుగుతున్న మార్పులను వివరించారు. విద్యార్థులకు సెకండక్టర్‌ ‌డిజైన్‌లో ప్రోత్సాహం అందించేందుకు సైనాప్సిస్‌, ‌క్యాడెన్స్ ‌వంటి అత్యాధునిక ఎఐ టూల్స్‌ను 315 విశ్వవిద్యాలయాలకు ఉచితంగా అందించినట్లు వెల్లడించారు. విద్యార్థులు స్వయంగా చిప్‌లను డిజైన్‌ ‌చేసి, మొహాలీలోని సెకండక్టర్‌ ‌ల్యాబ్‌లో వాటిని తయారు చేసి పరీక్షించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో చాలా కొద్ది విశ్వవిద్యాలయాలకే ఇలాంటి సదుపాయాలు ఉన్నాయని అన్నారు.
దేశంలోని ఎలక్టాన్రిక్స్ ‌తయారీ రంగం రెండంకెల వృద్ధిరేటుతో దూసుకెళ్తోందని అశ్విని వైష్ణవ్‌ ‌తెలిపారు. ప్రస్తుతం ఈ పరిశ్రమ విలువ రూ.13 లక్షల కోట్లకు చేరుకుందని, త్వరలోనే రూ.20 లక్షల కోట్లకు పెరుగుతుందని చెప్పారు. ఈ రంగం ద్వారా ఇప్పటికే 25 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని వెల్లడించారు. ఈ మధ్య భారత్‌ ‌నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యే వస్తువుల్లో మొబైల్‌ ‌ఫోన్లు అగ్రస్థానంలో నిలిచాయని, ఒకప్పుడు పెట్రోలియం, జెమ్స్ అం‌డ్‌ ‌జ్యువెలరీ ఆధిపత్యం ఉన్నా ఇప్పుడు ఎలక్టాన్రిక్స్ ‌రంగం వాటిని అధిగమించిందని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం 104 ఎలక్టాన్రిక్స్ ‌తయారీ సంస్థలు పనిచేస్తున్నాయని అశ్విని వైష్ణవ్‌ ‌తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 4 భారీ ఎలక్టాన్రిక్స్ ‌క్లస్టర్లను మంజూరు చేసిందని చెప్పారు. హైదరాబాద్‌లో హార్డ్‌వేర్‌ ‌ప్రోటోటైప్‌ ‌డిజైన్‌, ‌టెస్టింగ్‌, ‌వ్యాలిడేషన్‌ ‌కోసం కామన్‌ ‌ఫెసిలిటీ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దేశంలో తొలి బుల్లెట్‌ ‌ట్రైన్‌ ‌ప్రాజెక్టు ముంబై-అహ్మదాబాద్‌ ‌మధ్య వేగంగా నిర్మాణంలో ఉందని.. 2027లో తొలి దశ సేవలు ప్రారంభమవుతాయని అశ్విని వైష్ణవ్‌ ‌తెలిపారు. ఇదే అనుభవంతో దేశంలో మరో ఏడు బుల్లెట్‌ ‌ట్రైన్‌ ‌కారిడార్లకు ఆమోదం లభించిందని తెలిపారు.  దేశంలో ప్రస్తుతం అభివృద్ధి, పనితీరు ఆధారిత రాజకీయాలే నడుస్తున్నాయని అశ్విని వైష్ణవ్‌ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌తోనే బుల్లెట్‌ ‌ట్రైన్లు, సెకండక్టర్లు, ఎలక్టాన్రిక్స్ ‌తయారీ, ఆధునిక రైల్వే వ్యవస్థ వంటి కీలక రంగాల్లో భారత్‌ ‌ప్రపంచస్థాయికి చేరుకుంటోందని పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *