– గవర్నర్‌తో మర్యాదపూర్వక భేటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ బి.శివధర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని 8వ అంతస్తులో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల (నార్కోటిక్స్) నిర్మూలన, రహదారి భద్రత వంటి కీలక అంశాల్లో ఆయన తన అనుభవాలతో ప్రభుత్వానికి సహకరించనున్నారు. ఐపీఎస్ అధికారిగా 32 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉండగా ముఖ్యంగా, అంతర్గత భద్రత, మావోయిస్టులను జనజీవన స్రవంతిలో చేర్చే కార్యకలాపాలలో క్షేత్రస్థాయిలో విశేష సేవలందించారు. గతంలో ఇంటెలిజెన్స్ విభాగంతోపాటు పలు కీలక శాఖల్లో సమర్థవంతంగా పనిచేసిన అనుభవం ఉంది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం శివధర్ రెడ్డి లోక్ భవన్‌లో గవర్నర్సర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం శివధర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో పలువురు ఐపీఎస్ అధికారులు కలిసి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ సీపీ వి.సి.సజ్జనార్, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, మల్కాజిగిరి సీపీ¾ బి.సుమతి, ఐజీపీ ¾(పీ అండ్ ఎల్) గజరావు భూపాల్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. కార్యక్రమంలో హోం శాఖ, పోలీసు విభాగానికి చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





